గత సంవత్సరం ఒక శాస్త్రీయ అధ్యయనం రోజుకు ఒక గ్లాసు వైన్ తాగడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని వైన్ ప్రేమికులు సంతోషించారు. కానీ ఇప్పుడు ది లాన్సెట్ జరిపిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం వారానికి 100 గ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ అంటే సుమారు ఐదు గ్లాసుల వైన్, 9 గ్లాస్‌ల బీర్‌ను తీసుకునే వారు మీ ప్రాణాలకు హానికరం అని కొత్త అధ్యయనం చెపుతోంది.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ పరిశోధకులు 19 దేశాలలో దాదాపు 6,00,000 మంది మద్యం ప్రియుల ఆరోగ్య డేటాను అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే వారానికి 10 నుంచి 18 గ్లాసుల వరకూ వైన్, 20 నుంచి 40 గ్లాసుల వరకూ బీరును తీసుకునేవారు సగటు జీవిత కాలంలో రెండేళ్లకు ముందే అకాలమరణం చెందాతారని వెల్లడించారు.పరిమితికి మంచి మద్యం సేవించడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం మహిళలు రోజుకు ఒక ఆల్కహాల్ పానీయం తాగవచ్చని, పురుషులు మితింగా రెండు సార్లు వరకు తాగవచ్చని తెలిపారు.