పండుగ సేల్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ఎంత వ్యాపారం చేశాయో తెలుసా..?

-

దసరా పండుగను పురస్కరించుకుని ఈ-కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ప్రత్యేక సేల్‌లను నిర్వహిస్తున్న విషయం విదితమే. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌.. ఈ రెండు సేల్స్‌ బుధవారంతో ముగియనున్నాయి. అయితే ఈ రెండు సేల్‌లకు గాను మొదటి నాలుగు రోజుల్లోనే ఆ రెండు సంస్థలు ఏకంగా రూ.26వేల కోట్ల అమ్మకాలు జరిపాయి. ఈ మేరకు ఆర్థిక నిపుణులు ఈ విషయాన్ని తాజాగా విశ్లేషించి చెప్పారు.

do you know how much sales done on flipkart and amazon during special sales

అక్టోబర్‌ 15 నుంచి 21 తేదీల మధ్య సుమారుగా 3.5 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు ఆ రెండు సైట్లలో జరిగాయని ఫారెస్టర్‌ రీసెర్చ్‌ అండ్‌ రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ వెల్లడించింది. పండుగ నేపథ్యంలోనే వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపారని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ వెల్లడించారు. ఈ ఏడాది పలు కంపెనీలకు చెందిన సుమారుగా 1100 కొత్త ఉత్పత్తులను సేల్‌ సందర్భంగా లాంచ్‌ చేయడం జరిగిందన్నారు. శాంసంగ్‌, యాపిల్‌, షియోమీ, వన్‌ప్లస్‌, అసుస్‌, లెనోవో, హెచ్‌పీ, ఎల్‌జీ, వర్ల్‌పూల్‌, బజాజ్‌ తదితర కంపెనీలకు చెందిన ఉత్పత్తులను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేశారని తెలిపారు.

వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న వారు ఈసారి బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఎక్కువగా ఉత్పత్తులను కొన్నారని అన్నారు. ముఖ్యంగా లార్జ్‌ స్క్రీన్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఐటీ యాక్ససరీలు, ఇతర పరికరాలను ఎక్కువగా కొన్నారని తెలిపారు. గతేడాది ఇదే సమయంలో ఆ రెండు ఈ-కామర్స్‌ సంస్థలు 6 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక సేల్స్‌లో సుమారుగా రూ.20వేల కోట్ల అమ్మకాలు జరపగా.. ఈసారి మరో రూ.6వేల కోట్లు ఎక్కువగా అమ్మకాలు జరగడం విశేషం. కరోనా ఉన్నప్పటికీ ఈ-కామర్స్‌ సంస్థల వ్యాపారం జోరుగా సాగిందని మనకు అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news