టెట్ విషయం లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకసారి క్వాలిఫై అయితే ఆ సర్టిఫికెట్ వాల్యూ ఇక లైఫ్ టైమ్ ఉండనుంది. ఇప్పటి వరకు 7 సంవత్సరాల వాల్యూ మాత్రమే ఈ సర్టిఫికేట్ కి ఉండనుంది. అయితే ఈ నిర్ణయం భవిష్యత్ లో టెట్ రాసే వారికే అమలు చేయనున్నారు.
గతంలో రాసి క్వాలిఫై అయిన వారి విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకొని నిర్ణయం తీసుకుంటామని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. దీని వల్ల కేంద్ర నిరుద్యోగులకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. అసలు ఈ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మన దేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలి అనుకునే అభ్యర్థులకు నిర్వహించే అర్హత పరీక్ష ఇది. అయితే ఇప్పటికిది ప్రతిపాదన మాత్రమేనని ఈ విసహయం మీద రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.