వాట్సాప్ లో కమ్యూనిటీ ట్యాబ్ ఫీచర్ ఎలా పని చేస్తుందో తెలుసా..?

-

వాట్సాప్ ను ఉపయోగించడం చాలా సులభం. పైగా సందేశాలను పంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఈజీగా ఇమేజెస్, వీడియోస్ మొదలైన వాటిని వాట్సాప్ ద్వారా షేర్ చేసుకో వచ్చు. అయితే ఎప్పటికప్పుడు వాట్సాప్ ని అప్డేట్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ లో కొత్త ఫీచర్లు వస్తూనే ఉంటాయి. అయితే వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ ఇప్పుడు రాబోతోంది.

అదే కమ్యూనిటీ ట్యాబ్ ఫీచర్. మరి ఇక ఈ కమ్యూనిటీ ఫీచర్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్, బీటా యూజర్లకి కూడా అందుబాటులోకి రానుంది. ఈ కమ్యూనిటీ ట్యాబ్ చాట్ స్క్రీన్ కి లెఫ్ట్ సైడ్ ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫీచర్ ద్వారా యూజర్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్ క్రియేట్ చేసుకోవడం తో పాటు ఎక్కువ మందితో మెసేజ్ ని షేర్ చేసుకోవడానికి అవుతుంది. ఫేస్ బుక్ లో లాగే వాట్సాప్ లో కూడా ఈ కమ్యూనిటీ ఫీచర్ పని చేస్తుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వాట్సాప్ గ్రూపులకు భిన్నంగా ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది అనే దాని పై క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉంది. అయితే ఈ ఫీచర్ బయటకు రావడానికి మరి కొన్ని రోజులు సమయం పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news