కళ్ళని నులుముకుంటే ఈ ఇబ్బందులు తప్పవు తెలుసా..?

-

చాలా మంది కళ్ళని నులుముకుంటూ ఉంటారు. అలా నులుముకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. మీరు కూడా ఎక్కువగా కళ్ళని నులుముకుంటూ ఉంటారా..? అయితే తప్పక మీరు దీని కోసం తెలుసుకోవాలి. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

 

అసలు కళ్ళను ఎందుకు నులుముకోవాలని అనిపిస్తుంది…?

కాలుష్యం, కళ్ళు అలసిపోవడం ఎక్కువ స్క్రీన్స్ ముందు సమయాన్ని గడపడం వల్ల కంటికి ఇబ్బందులు వస్తాయి. దీని కారణంగా దురద కలగడం, మండడం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అలాంటి సమయంలో కళ్ళని నులుముకుంటూ ఉంటాం. అయితే ఎలర్జీ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది.

ఎందుకు కళ్ళని నులుముకోకూడదు:

కళ్ళని నులుముకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు ఒక లుక్కేయండి.

కంటి సమస్యలు మరియు క్రోనిక్ కండిషన్స్:

కళ్ళని నులుముకోవడం వల్ల కళ్ళు మండుతాయి. ఇన్ఫెక్షన్స్ లేదా ఎలర్జీలు నమ్ముకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ లేదా ఎలర్జీ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చేతికి ఉండే బ్యాక్టీరియా లేదా వైరస్ వంటివి కళ్లకి అంటుకుని అలర్జీ వంటి సమస్యలు వస్తాయి.

ఇరిటేషన్ మరియు బర్నింగ్ సెన్సేషన్:

వేళ్ళకి ఏదైనా కారం వంటి పదార్ధాలు వున్నా లేదంటే దుమ్ము ధూళి వున్నా అవి కంటికి అంటుకుని ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్ కలిగిస్తాయి. ఇలా కళ్ళని నులుముకోవడం వలన ఈ సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news