కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ వలన కలిగే లాభాలు తెలుసా..?

-

కరోనా వైరస్ సమయంలో ఇంటి పట్టున ఉండటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యం అయితే కానీ ఇంటి నుంచి బయటకు వెళ్లడం మంచిది కాదు. వీలైనంత వరకూ ఇంటి పట్టునే ఉండి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

ఇలా చేయడం వల్ల వైరస్ రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. ఇప్పటికే వ్యాక్సిన్ ని చాలామంది వేయించుకున్నారు. వేక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ మీ ఇంట్లో ఉండే ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ విధానాన్ని ఇప్పుడు చూసేయండి.

కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

మీరు కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని కోవిడ్ పోర్టల్ ద్వారా కాని ఆరోగ్య సేతు యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ముందుగా కోవిడ్ వెబ్ సైట్ కి వెళ్లి మీ మొబైల్ నెంబర్ ని టైప్ చేసి ఆ తర్వాత ఓటిపి ని కూడా ఎంటర్ చేయండి.
మీ ఫోన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరి పేర్లు అక్కడ వస్తాయి.
రెండు వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళ పేర్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
అక్కడ సర్టిఫికెట్ కూడా మీకు కనబడుతుంది.
అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు మీ సర్టిఫికెట్ మీ పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆరోగ్య సేపు యాప్ ద్వారా ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

ఆరోగ్య సేతు అప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆరోగ్య సేతు అప్ లో కోవిడ్ పోర్టల్ లోకి వెళ్లి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ బెనిఫిషరీ రిఫరెన్స్ ఐడీని ఎంటర్ చేయాలి.
ఇది కోవిడ్ పోర్టల్ లో కుడి వైపు వస్తుంది.
పిడిఎఫ్ మీద క్లిక్ చేస్తే సర్టిఫికెట్ మీరు పొందొచ్చు.

సర్టిఫికెట్ ఎందుకు అవసరం అంటే…? మీరు వాక్సిన్ తీసుకున్నందుకు ఇది ప్రూఫ్. అలానే మీరు ఎక్కడికైనా వెళితే సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version