ఆర్ ఎస్‌యూ నుంచి ఆర్ఎస్ఎస్‌ దాకా.. ఊహ‌కంద‌ని ఈట‌ల వ్యూహం!

-

ఈట‌ల రాజేంద‌ర్ చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాలు వేగంగా తిరుతున్నాయి. ఆయ‌న ఎప్పుడు ఏం చేస్తారో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడైతే మంత్రి ప‌ద‌వి పోయిందో అప్ప‌టి నుంచి సైలెంగ్‌గా త‌న ప‌ని కానిచ్చేస్తున్నారు. అటు నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి కార్య‌క‌ర్తులు, అనుచ‌రుల‌తో చ‌ర్చించారు. అనంత‌రం హైద‌రాబాద్ వ‌చ్చి వ‌రుస‌గా అన్ని పార్టీల నేత‌ల‌ను క‌లుస్తున్నారు.

అయితే ఇక్క‌డ ఆయ‌న ఒక పార్టీ నేత‌ల‌ను క‌లిస్తే ఆ పార్టీలో చేరుతార‌ని అంతా అనుకోవ‌డం కామ‌న్‌. కానీ ఆయ‌న అన్ని పార్టీల నేత‌ల‌న క‌లుస్తున్నారు. ముఖ్యంగా అసంతృప్త నేత‌ల‌తో వ‌రుస భేటీలు అంతుచిక్క‌ట్లేదు.

వారంద‌రితో ఆయ‌న ఓ పార్టీ పెడ‌తారా అనే అనుమానం క‌లుగుతోంది. మ‌రోవైపు మ‌ద్దతు కూడ‌గ‌డుతున్నారేమో అని అనిపిస్తోంది. అయితే ఆయ‌న ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన‌ప్పుడు ఓ విష‌యం స్ప‌స్టంగా చెప్పారు. ఆర్ ఎస్‌యూ నుంచి ఆర్ ఎస్ ఎస్ వ‌ర‌కు అంద‌రినీ క‌లుపుకుపోతాన‌ని చెప్పారు. అంటే దీన్ని బ‌ట్టి ఆయ‌న పార్టీ పెడ‌తార‌ని, లేదంటే మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతార‌ని స్పష్టంగా అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఆయ‌న త‌ర్వాత ఎవ‌రిని క‌లుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version