గుమ్మడి గింజలు రోజు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

-

మనం చాలా ఫుడ్ ఐటమ్స్ ని వాటిలో ఉన్న లాభాలు తెలియక లైట్ తీసుకుంటుంటాం. ఫిట్ గా ఉండాలి అంటే..శరీరానికి అన్నిరకాల పోషకవిలువలు అందించాలి. గుమ్మడి గింజలు గురించి మీకు తెలుసా..ఇందులో ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్స్, జింక్ వంటి పోషకాలు గుమ్మడికాయ గింజల్లో ఉంటాయి. మీరు కానీ పంప్కిన్ సీడ్స్ రోజు తింటే చాలా మంచిది. అయితే ఈరోజు మనం తెలుసుకుందాం పంప్కిన్ సీడ్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.

1. బరువుతగ్గేందుకు

ఈ గింజల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి…బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఇంకేం చిరుదిళ్లు తినాలనిపించదు. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు ఈ గింజలు జీర్ణక్రియను కూడా మంచిగా చేస్తాయి.

2. ఎముకలకు మంచిది

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి.. అది మన ఎముకల తయారీకి చాలా అవసరం. ఎంత ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే, అంతలా ఎముకలు పటిష్టంగా మారతాయి.. అప్పుడు అస్థియోపోరోసిస్ అంటే ఎముకలు చిట్లిపోయే వంటి వ్యాధులు దరిచేరవు.

3. గుండెకు కూడా మంచిదే

ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ గుండెకు మేలు చేస్తాయి. ఈ గింజల్లో నీటిలో కరిగిపోయే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతాయి.

4 షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది

ఈరోజుల్లో డయాబెటీస్ తో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండవు. ఈ చిన్న గింజలు తింటే ఘుగర్ కంట్రోల్ లో ఉంటుంది. మొదట ఎలుకలపై ఈ ప్రయోగం చేసినప్పుడు వాటి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయి. అందువల్ల మనుషులకైనా ఇవి చక్కగా పనిచేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

5. రోగనిరోధక శక్తి పెంచటానికి

కెరాటెనాయిడ్స్, విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్స్ ఉండే ఈ గింజలు మన బాడీలో వేడిని తగ్గిస్తాయి. కణాల్ని విష సూక్ష్మక్రిముల నుంచీ కాపాడతాయి. రోజూ ఈ గింజలు తింటే జలుబు, జ్వరం వంటివి కూడా రావట.

6. మంచినిద్రకు కూడా ఇవే

కొంతమందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు. కళ్లు ముయ్యగానే ఏవేవో ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా నిద్రమాత్రం రాదు. ఇంక ఏం చెయ్యాలో తెలియక కొందరు నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు గుమ్మడికాయ గింజలు తింటే సరి. వీటిలో ట్రైప్టోఫాన్ ఉంటుంది. అది నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టాలంటే పంప్కిన్ సీడ్స్ తినడమే పరిష్కారం. అలాగే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచడంలో కూడా గుమ్మడి గింజలు బాగా ఉపయోగపడతాయి.

7. జుట్టుపెరగటానికి

ఓర్ని జుట్టుపెరగటానికి కూడా ఈ గింజలు ఉపయోగపడతాయా.. ఈ విషయం తెలియక జుట్టుకి ఏవేవో వాడుతున్నామే అనుకుంటున్నారా. ఒకసారి ఈ గింజలు తిని ట్రై చేయండి. ఈ గింజల్లో కుకుర్బిటిన్ ఇదో రకం అమైనో యాసిడ్ ఉంటుంది. అది జుట్టును పెరిగేలా చేస్తుంది.

8. ఇంతకి వీటిని తినటం ఎలా?

ఈ గింజలు ఎలా తినాలి అన్న డౌట్ ఇప్పటికే మీకు వచ్చి ఉంటుంది. వాటిని పచ్చిగా ఉన్నవే తినవచ్చు. లేదా వేపుకొని… సాయంత్రం వేళ స్నాక్స్‌లా కూడా తినవచ్చు. అంతే కాదు… సలాడ్లు, సూప్‌లలో కూడా వాటిని వేసుకొని తినొచ్చు. ఎలా తిన్నామని కాదు.. తినడం ముఖ్యం. కాబట్టి గుమ్మడిగింజలు తినటం అలవాటు చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news