మొక్కజొన్న వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

-

సన్నని చినుకులు పడుతూ ఉంటే ఎర్రటి నిప్పులపై కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటే ఆ మజానే వేరు. కమ్మని రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మొక్కజొన్న పొత్తులో దాగి ఉన్నాయి.ఇందులో శక్తివంతమైన పోషకాలు కణజాలతో పాటు ఎ,బి,సి,డి విటమిన్స్ కూడా లభిస్తాయి. మొక్కజొన్నలో పాంటో థైనిక్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేందుకు ఎంతగానో దోహదపడుతుంది. మొక్కజొన్నలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం మొలల సమస్యతో పాటు పేగు క్యాన్సర్ ను కూడా అరికడుతుంది.

రక్తహీనత సమస్యతో బాధపడే వారు పాలిట మొక్కజొన్న ఒక అద్భుత వరం అని చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ బి12 ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్స్ రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. ఇది రక్తంలోని ఎర్ర రక్త కణాల వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.మొక్కజొన్న రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండా ఆరోగ్యాన్ని పెంచుతుంది.రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించి రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది.తద్వారా గుండెపోటు, పక్షవాతం, బిపి ఉంటే సమస్యలను తగ్గిస్తుంది.మొక్కజొన్న శరీరపు ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతుంది. ఇందులో లభించే కణజాల శాతం ఎక్కువే.ఇందులో ఉండే ఫాస్ఫరస్ మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. మెగ్నీషియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే మెదడు మరియు నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

మొక్కజొన్న లో ఉండే ఫైటో కెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. అందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారు తమ డైట్లో మొక్కజొన్నతో చేసిన పదార్థాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు.అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కెన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. ఇందులో అధికంగా ఉండే విటమిన్ బి,హైపర్ టెన్షన్ను తగ్గిస్తుంది. తాజా అధ్యయన ప్రకారం అల్జీమర్స్,మధుమేహం, బీ. పి హృదయ రోగాలను నివారించడంలో మొక్కజొన్న ఎంతగానో ఉపయోగపడతాయని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news