ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా..?

-

పురాతన కాలం నుండి ఉపయోగించే ఈ ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. మరి నిజంగా ఆముదం వల్ల ఎటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందో చూద్దాం. ఆముదంలో తెలుపు, ఎరుపు, పెద్దాముదం అనే మూడు జాతులుంటాయి. ఈ చెట్టు ఆకులు పైకి ఎత్తుకునే ఉంటాయి. వాతరోగాలనూ పోగొట్టడంలో ఆముదం ప్రధాన పాత్ర పోషిస్తుంది. విష జ్వరాలు, గుండె జబ్బులు, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సైతం ఆముదం నయం చేస్తుంది. మూత్ర పిండాల పని తీరును కూడా ఆముదం మెరుగు పరుస్తుందట. అలానే ఆముదం బోదకాలు సమస్యను కూడా నివారిస్తుంది.

ఇది ఇలా ఉండగా శరీరం లో పేరుకు పోయిన విషతుల్యాలను బయటకు పంపడంలో ఆముదం కీలక పాత్ర పోషిష్తుంది. అంతే కాదండి ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లును నయం చేస్తుంది. కాళ్లల్లో మంటలు కలిగి ఇబ్బంది పడే వాళ్ళు ఆముదం, కొబ్బరి నూనెలను సమానంగా కలిపి అరికాళ్లకు మర్దన చేస్తే, కాళ్లలో వచ్చే మంటలు త్వరగా తగ్గిపోతాయి. అలానే కొద్ది మోతాదులో రాత్రి పూట ఆముదాన్ని తీసుకుంటే మూత్ర కోశం లోని రాళ్లు కరిగిపోతాయి.

దగ్గు నుండి ఉపశమనం కలగాలంటే ఆముదం లో తాలింపు వేసిన చామ దుంపల కూర తింటే దగ్గు తగ్గిపోతుంది. ఆముదం గింజలు, శొంఠి కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి.. రెండు నెలలు పాటు రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున తీసుకుంటే శరీరం పై నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. చూసారా ఆముదం వెనక ఎన్ని లాభాలు ఉన్నాయో…!

Read more RELATED
Recommended to you

Latest news