కరీంనగర్ జిల్లాలో బిగ్ బాస్ సీజన్- 4 ఫేమ్ సోహెల్ పర్యటించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కరీంనగర్ కార్కానగడ్డ అని కరీంనగర్ గడ్డమీద పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎంతో కష్టపడ్డాను, అందరి సహకారంతో తగిన గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. పదేళ్ళ శ్రమకు ఫలితమే బిగ్ బాస్ అని పేర్కొన్న ఆయన తాను నటించిన సినిమా పేరు త్వరలేనే ప్రకటిస్తానని అన్నారు.
కరీంనగర్ లో సినిమా తీయాలనుకుంటున్నానన్న ఆయన సింగరేణిలో ప్రమాదాలపై త్వరలో ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. వందరోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉండడం వల్ల తల్లిదండ్రుల విలువ ఏమిటో తెలుసుకున్నానని అన్నారు. ఉన్నదాంట్లో సర్దుకోవాలని నేర్చుకున్నానని అన్నారు. జీవితంలో ఫ్రెండ్స్ కు విలువ ఇవ్వాలి..తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నానని సోహైల్ పేర్కొన్నాడు.