రామ్ చరణ్ ధరించే ఒక్కో సూట్ ధర ఎంతో తెలుసా..?

-

ప్రపంచ స్థాయిలో స్పాట్ లైట్ అవార్డు అందుకున్న రామ్ చరణ్ గురించి.. ఆయన ఫ్యాషన్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు ఆయన డ్రెస్సింగ్ చూసి అడ్మైర్ అవుతుంటారు ఫ్యాన్స్.. సినిమాలలో క్యారెక్టర్స్ పరంగా ఎలా కనిపించినా సరే బయట పర్సనల్ లైఫ్ లో ఎలాంటి స్టైల్ మెయింటెయిన్ చేస్తున్నారన్నది అభిమానులు బాగా ఫాలో అవుతుంటారు.  ముఖ్యంగా మెగాస్టార్ రామ్ చరణ్ అభిమానులైతే ఎక్కువగా అదే పనిలో ఉంటారని చెప్పడంలో సందేహం లేదు.  ఎందుకంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఒక్క అభిమానులనే కాదు ప్రపంచ స్థాయిలో సెలబ్రిటీలను కూడా మెప్పించింది అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులు , ఫిలిం మేకర్స్ చేత గ్లోబల్ రికగ్నిషన్ లభించింది. ఇటీవల రాంచరణ్ పెర్ఫార్మన్స్ ని టైటానిక్ , అవతార్ చిత్రాల లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా కొనియాడారు.
Imageఅంతేకాదు అక్కడి లోకల్ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ తో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల వేడుకలలో కూడా రామ్ చరణ్ పాల్గొని సందడి చేశారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ అమెరికా వెళ్లి అవార్డు వేడుకలో సందడి చేయడంతో పాటు ఆయన ధరించిన సూట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Image

దీంతో రాంచరణ్ ధరించిన సూట్స్ ధర ఎంత?  ఎక్కడ డిజైన్ చేయించారు ? అనే వివరాలను ఆరా తీయగా.. చెన్నైకి చెందిన ప్రముఖ డిజైనర్ సూట్ మేకర్ ఉస్మాన్ అబ్దుల్ రజాక్ డిజైన్ చేశారట.  వీటిలో ఒక్కో సూటు కోసం చరణ్ సుమారుగా రూ.13 నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక సూట్స్ లో రామ్ చరణ్ రాయల్ లుక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఏది ఏమైనా ఫ్యాషన్ లో మెగా పవర్ స్టార్ మరోసారి తన రేంజ్ను నిరూపించుకున్నారని చెప్పడంలో సందేహం లేదు.</

div>

Read more RELATED
Recommended to you

Latest news