RRR చిత్రంలో కీలక పాత్ర పోషించిన మల్లి ఎవరో మీకు తెలుసా?

-

టాలీవుడ్ జక్కన్న తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలు. సినిమాలో వీరి పర్ఫార్మెన్స్ చూసి జనం ఫిదా అవుతున్నారు. కాగా, వీరిద్దరి నటన తర్వాత మల్లి పాత్ర పోషించిన అమ్మాయి గురించి జనాలు చర్చించుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కథను ముందుకు నడిపించే మల్లి పాత్రలో ఆ అమ్మాయి ఒదిగిపోయిందని ప్రశంసిస్తున్నారు సినీ ప్రేక్షకులు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ స్టోరి ఈ అమ్మాయి పాత్రతోనే మొదలవుతుంది.

గిరిజన బిడ్డగా ఉన్న మల్లిని బ్రిటిష్ దొరసాని ఢిల్లీకి తోలుకపోగా, ఆమె కోసం భీమ్ (తారక్) ఢిల్లీకి రావడం, ఇక ఆ తర్వాత రామరాజు (రామ్ చరణ్)తో పరిచయం చివరకు బ్రిటిష్ వాళ్లపై యుద్ధం.. అలా సినిమా సాగిపోతుంటుంది. మొత్తంగా పిక్చర్ లో మెయిన్ పిల్లర్ గా మల్లి పాత్ర పోషించిన అమ్మాయి నిలిచిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘నన్ను ఈడ ఇడిసిపోకన్న అమ్మా.. యాదికొస్తాంది’ అంటూ అమ్మాయి చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి.

మల్లి పాత్ర పోషించిన ఆ అమ్మాయి పేరు ట్వింకిల్ శర్మ.. ఈమెది ఛండీగర్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం స్టార్ట్ అయినపుడు ఈ అమ్మాయి ఎనిమిదో తరగతిలో ఉంది. ప్రస్తుతం పదో తరగతి చదవుతోంది ఈ గర్ల్. ఈ చిత్రంతో బాగా పాపులర్ అయిన మల్లి అలియాస్ ట్వింకిల్ శర్మ.. అంతకు మునుపు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ అనే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మాయి.. ఫ్లిప్ కార్ట్ యాడ్స్ లోనూ నటించింది. అలా యాడ్స్ లో ఈమెను చూసి రాజమౌళి ఆడిషన్ కు పిలిపించి మల్లి పాత్రకు సెలక్ట్ చేశాడు. అలా ఈ అమ్మాయి కథే మారిపోయింది. విజ్యువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ లో మెయిన్ పిల్లర్ గా నిలిచిపోయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news