తన ఆస్తి మొత్తాన్ని ప్రకాష్ రాజ్ ఎవరికి ఇస్తున్నారో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోపాన్ని చూపించడానికి అయినా హాస్యం పండించడానికి అయినా ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇక ప్రకాష్ రాజ్ భాష ఏదైనా ప్రేక్షకులను ఎల్లవేళలా నవ్విస్తూ ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈయన చిన్నతనం నుండి సినిమాలపై ఎక్కువ మక్కువ పెంచుకున్నాడు. అందుకే చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి మంచి అవకాశాలు సొంతం చేసుకున్నాడు.

విలన్ గా , హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ చాలామందికి ఒక నటుడిగా మాత్రమే తెలుసు. ఇక ఆయనపై ఉన్న రూమర్లు , ఆరోపణలు చాలామందికి తెలిసినప్పటికీ.. ఆయనకి దేశం పై ఉన్న గౌరవం.. ఎదుటివాడికి సేవ చేయాలనే తత్వం ఇలా ఆయనలో దాగి ఉన్న మంచి విషయాలు చాలామందికి తెలియదనే చెప్పాలి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నందుకు తెలుగులో ఆయనకు మంచి ఆదరణ లభించింది. ఇక అందుకే తనపై అభిమానాన్ని చూపే వారి కోసం తన వంతు సహాయం చేయాలని తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్నారెడ్డిపల్లి అనే ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఎన్నో మార్పులు కూడా చేశాడు.

ఇక ప్రకాశ్ రాజ్ .. పేదవారికి.. సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈయన ద్వారా ఎన్నో వసతులు చేకూర్చి వారికి సహాయాన్ని అందిస్తున్నారు. తెలంగాణ లో మాత్రమే కాకుండా తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా బండ్లర్ హట్టి అనే ప్రాంతాన్ని కూడా దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకోవడమే కాదు ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు, రైతులకు ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వం తో మాట్లాడడానికి కూడా ఆయన ముందడుగు వేస్తారు. అందుకే అక్కడి ప్రజల హృదయాలలో ప్రకాష్ రాజు చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక తన ఆస్తిని ఈ రెండు గ్రామాలకు ఇవ్వబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రకాష్ రాజు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version