రెచ్చిపోయిన యువకులు..ఓ అమ్మాయిని ప్రేమించినందుకు అర్ధరాత్రి కత్తులతో దాడి

-

రాజేంద్రనగర్ అల్కాపురి టౌన్ షిప్ లో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి రెచ్చిపోయిన కొందరు యువకులు ఎం.డీ నసీర్ అనే యువకుడు పై కత్తులతో దాడి చేశారు. విచక్షణ రహితంగా నజీర్ ను కత్తులతో పొడిచారు యువకులు. ఓ అమ్మాయిని ప్రేమించిన పాపానికి నజీర్ పై దాడి చేశారు.నవీద్, అక్బర్ అనే ఇద్దరు యువకులు ఎం.డి నసీర్ అనే యువకుడిపై అర్ధరాత్రి కత్తులతో దాడి చేశారు.

నజీర్ ప్రాణం పోయింది అని భావించి అక్కడి నుంచి పారిపోయారు యువకులు. తీవ్ర గాయాలపాలైన నజీర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version