వేడినీటితో స్నానం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

-

చాలా మందిలో ఒక గందరగోళం ఉంటుంది. అదేంటంటే స్నానం వేడి నీళ్లతో చేయడం మంచిదా.? లేక స్నానం చల్లని నీళ్లతో చేయడం మంచిదా..? అనే సందేహం ఉంటుంది. అయితే దీనిపై పరిశోధకులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అదేంటంటే.. వేడినీటితో స్నానం చేయడం వల్ల మన శరీరానికి కొంతవరకు వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందట. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో సాధారణంగా వేడి ఉత్పన్నం అవుతుంది. ఈ వేడి వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. అలాగే వేడినీటి స్నానం చేయడం వల్ల కూడా శరీరంలో అలాంటి ప్రక్రియ జరుగుతుందని కొంతమంది శాస్త్రజ్ఞులు వెల్లడించారు.

hot water bath
hot water bath

నిత్యం వేడి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతరాత్ర గుండె సమస్యల ముప్పు తగ్గుందట. అలాగే వేడి నీటి స్నానం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరగడం, రక్తపోటు తగ్గడం వంటివి జరుగుతున్నాయని, అందువల్లే గుండె సమస్యలు తగ్గాయని శాస్త్రజ్ఞులు తెలిపారు. వేడి నీటి స్నానం గురించి ఫాల్కనర్‌ అనే శాత్రవేత్త మరో పరిశోధన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అభ్యర్థుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు, శరీరంలోని అంతర్భాగాల్లో ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ఏర్పాట్లు చేశారు.అధ్యయనం మొదటి దశలో అభ్యర్థులు 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిలో కొలనులో గంట సేపు స్నానం చేశారు.

రెండో దశలో వీరందరితో గంటపాటు సైకిల్‌ తొక్కించారు. ఈ రెండు దశల్లో వారి శరీరాల్లో కలిగిన మార్పులను గమనించారు. వేడినీటి స్నానం చేసినవారిలో 140 క్యాలరీలు కరిగినట్లు గుర్తించారు. గంట సేపు సైకిల్‌ తొక్కినవారిలో సుమారు 630 క్యాలరీలు కరిగినట్లు తెలుసుకున్నారు. సైకిలింగ్‌ తో పోల్చితే వేడి నీటి స్నానం వల్ల కరిగిన క్యాలరీలు తక్కువే కావచ్చు. కానీ, కేవలం స్నానంతోనే 100 పైగా క్యాలరీ తగ్గడం నిజంగా నమ్మలేని నిజం. అంతేకాకుండా, వేడినీళ్ళతో స్నానం చేయడం వల్ల కండరాలు సంకోచం చెంది నొప్పులు తగ్గుతాయి. అలాగే వేడి నీటి స్నానం చేయడం వల్ల అలసిపోయిన శరీరం కొంచెం ఉత్తేజంగా, ఆహ్లదంగా మారుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news