తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది కనుమరుగైన హీరోలు కూడా ఉన్నారు. అయితే మొదట మంచి స్టార్డం సంపాదించి ఆ తర్వాత సినిమాలలో నటించినా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన హీరోలు ఉన్నారు. కానీ హీరోలు చేసే సాహసాలను చూసి తమ అభిమానుల సైతం ఫిదా అవుతూ ఉంటారు కానీ వారు కూడా మనలాంటి సామాన్యులే అని వారికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయని చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడు అలా మన హీరోలకు ఉన్న బలహీనతల గురించి తెలుసుకుందాం.
1). తెర పైన ఎనర్జిటిక్ గా కనిపించే బాలకృష్ణకు చాలా కోపం ఎక్కువ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ సినిమా షూటింగ్ మొదలుపెట్టేటప్పుడు కానీ ఏదైనా ఇంట్లో కార్యక్రమాలు జరిపేటప్పుడు గానీ జాతకాలను చూపిస్తారట.
2). ఇక ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మహేష్ కు ఎక్కువగా సిగరెట్ తాగే అలవాటు ఉండేది . కానీ ఆ అలవాటుని నెమ్మదిగా మానివేశారు. మహేష్ కి షూటింగ్ సెట్లు తనకు సంబంధం లేని వ్యక్తులు ఉంటే అసలు సహించడట. దాంతో తనే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారట.
3). ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆ సినిమాని షూటింగ్ మొదలు పెడతాడు లేదంటే డైరెక్షన్ వరకు వెళ్లి కొన్ని టిప్స్ కూడా ఇస్తూ ఉంటాడు.
4). జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్లో ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే చాలు ఎటువంటి మొహమాటం పడకుండా వారితో కలిసిపోయి అందర్నీ ఆటపట్టిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ షూటింగ్లో చాలా సందడి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాడు.
5). ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందాడు. అయితే ఏమైనా పెద్ద సన్నివేశాలు చేసేటప్పుడు ఎవరిని సెట్లో ఉంచరట.. అందుకు కారణం ప్రభాస్ కు సిగ్గు ఎక్కువ అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బాగా భోజనం ప్రియుడు కూడా.