తెలంగాణకు చెందిన ఇద్దరికి ఎంఎస్ఎంఈ పురస్కారం బహూకరణ

ప్రముఖ సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల సంస్థ ట్యాలీ ఇటీవల ఎంఎస్ఎంఈ పురస్కార విజేతలను అధికారికంగా ప్రకటించింది. ఈ విజేతల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు అవార్డుకు ఎంపికయ్యారు. దక్షిణాది జోన్‌లో 5 కేటగిరీలకు 2 కేటగరీల్లో అవార్డులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన గ్రేడియంట్ సైన్స్ యజమాని పవన్ త్రిపాఠి, వరంగల్‌కు చెందిన శ్రీనివాస ఏజెన్సీ అధినేత యాడా శ్రీనివాస్‌ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 27వ తేదీన ఎంఎస్ఎంఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

ఎంఎస్ఎంఈ పురస్కారాలు
ఎంఎస్ఎంఈ పురస్కారాలు

ప్రతిఏటా ఎంఎస్ఎంఈ హానర్ పేరిట ట్యాలీ అవార్డులు ప్రకటిస్తారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లల్లోని ఐదు కేటగిరీల్లో అవార్డులు అందజేస్తారు. బిజినెస్ మ్యాస్ట్రో, వండర్ ఉమెన్, నెక్ట్స్ జెన్, ఛాంపియన్ ఆఫ్ కాజ్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మర్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటిస్తారు. ఇందులో దక్షిణాది నుంచి తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎంపికయ్యారు.