సీఎం జగన్ ఢిల్లీ పయనం అయిన విషయం తెలిసిందే. కొన్ని గంటల ముందే గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరారు. రేపు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఏపీ సీఎం జగన్ పర్యటన ఆంధ్ర రాజకీయాలలో ఎంతో ఆసక్తిని సంతరించుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీతో జగన్ ఎందుకు భేటీ అవుతున్నారు అనేదానిపై ప్రస్తుతం టిడిపి పార్టీ విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మోడీతో భేటీ పై వివిధ కారణాలను తెరమీదికి తీస్తూ టిడిపి విమర్శలు చేస్తున్నారు.
ఇటీవలే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పై స్పందించిన మాజీమంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు జగన్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రివర్గంలో పదవుల బేరం కోసం మాత్రమే వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు అనుకుంటా అంటూ జోస్యం చెప్పారు దేవినేని. పార్టీ ఎంపీలు అందరినీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి సైతం ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని వైసీపీ పార్టీ చెప్పిందని కానీ ప్రస్తుతం… ఆ విషయంలో వైసిపి చేతులెత్తేసింది అంటూ విమర్శించారు. చివరికి ప్రజలను నమ్మించి ఇప్పుడు నమ్మకద్రోహం చేశారు అంటూ విమర్శించారు దేవినేని ఉమా.