కొబ్బరి నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వలన ఏమవుతుందో తెలుసా..?

-

మీరు ఎప్పుడైనా కేరళ వాళ్ళను చూసారా…? చక్కని దేహ కాంతితో.. ఒత్తయిన జుట్టుతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు.దీని వెనక ఉన్న కారణం ఏమిటో తెలుసా వారు.. కొబ్బరి నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవడమే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళాలో గుండెపోటు జబ్బులు కూడా తక్కువే.

మిగతా నూనెలతో పోలిస్తే కొబ్బరి నూనె ప్రథమ స్థానంలో ఉంటుంది. అధిక బరువును తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని పెంచడం, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరి నూనె వాడకం వలన కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…

కొబ్బరి నూనెలో సహజ సంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు సహాయపడతాయి. ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. అలాగే ఇందులో ఉండే లారీక్ యాసిడ్ కొలెస్ట్రాల్, రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా రక్షణ ఇస్తుంది.

కొబ్బరి నూనె యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉంది.ఇందులో ఉండే లారీక్ యాసిడ్ బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర హానికర శిలింద్రాల నుండి శరీరాన్ని కాపాడుతుంది. కొబ్బరి నూనె వాడకం వలన అనేక రకాల అంటువ్యాధులను తరిమికొట్టవచ్చు.

కొబ్బరి నూనె మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది.దీని ఫలితంగా శరీరం బరువు అదుపులో ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడం ద్వారా ప్రేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీర్ణకోశంలో ఉన్న ఆమ్లాలను క్రమబద్ధీకరిస్తుంది.

కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్స్ మహిళల్లో హార్మోన్లలో సమతుల్యాన్ని ఏర్పరిచి దానిని సరైన స్థాయిలో కొనసాగేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా మహిళల్లో థైరాయిడ్ మరియు ఎండోక్రైన్ గ్రంధులు సక్రమంగా పనిచేసే సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news