హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. పెళ్లి కోసం ఏం చేస్తుందో తెలుసా..?

-

ఇండస్ట్రీలోకి మొదట హీరోయిన్ గా నటించి అంతగా మెప్పించలేకపోయిన ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈమెను జయమ్మ అంటే ప్రేక్షకులు టక్కున గుర్తుపడతారు. క్రాక్ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో సినిమాలలో కీలకమైన పాత్రలో నటించి మెప్పించింది. దీంతో ఈమెకు హీరోయిన్ గా కంటే విలన్ గానే పలు అవకాశాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఒక చిత్రంలో ఈమె విలన్ పాత్రలో నటిస్తోంది.

అలాగే సమంత నటిస్తున్న యశోద చిత్రంలో కూడా వరలక్ష్మి కీలకమైన పాత్రలో నటిస్తున్నది. అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో తను షేర్ చేసిన కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను వరలక్ష్మి చాలా సన్నగా కనిపిస్తోంది. అయితే బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సడన్గా ఇలా సన్నజాజులా మారిపోవడంతో ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. దీంతో మరికొందరు మాత్రం ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు లెక్కపోతోందని అందుచేతనే ఇలా సన్నగా మారిపోయింది అని పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

అయితే గడిచిన కొన్ని నెలల క్రితం వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం చేసుకోబోతోంది అని వార్తలు కూడా బాగా వినిపించాయి. ఇక అంతే కాకుండా హీరో విశాల్ వరలక్ష్మి లవ్ లో ఉన్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ కూడా బాగా వినిపిస్తోంది. మరి ఈ విషయంలో వాస్తవం ఎంతుంది అనే విషయం తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ సంబంధించి ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version