ఆంధ్రాలో అయితే ఎండలు నిప్పులుకక్కుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు లాంటి సిటీల్లో అయితే కాస్త కూల్‌గా ఉంటుంది. విజయవాడలో ఎండలకు జనాలు అల్లాడిపోతున్నారు. చెమట, దుర్వాసన అబ్బో అసలు ఈ కాలం ఎప్పుడు ముగుస్తుందో అని అందరూ అనుకుంటారు. బాడీలో అన్ని భాగాల్లో చెమట పడుతుంది.. కానీ మీకు తెలుసా..? చెమట పట్టని భాగం ఒకటి ఉందని..?
శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట వస్తుంది. మీరు వ్యాయామం చేసినప్పుడు కూడా చెమట పడుతుంది. వేసవిలో ముఖానికి మేకప్ వేసుకునే వారి పరిస్థితి మరీ దారుణం. తొడలు, మెడ, చంకలు, కడుపు, చేతులు, పాదాలు అన్ని వైపుల నుండి చెమట పడుతుంది. చెమట దుర్వాసనను వదిలించుకోవడానికి, ఖరీదైన పరిమళ ద్రవ్యాలను సైతం వాడతాం.. మరీ అసలు ఎంత ఎండాకాలం అయినా బాడీలో చెమట పట్టని భాగం ఏంటబ్బా..?
అదేనండి.. మన పెదాలు.. మన పెదవులకు ఎప్పుడూ చెమట పట్టవు. చెమట పెదాలను ఎప్పుడైనా చూశారా? మన పెదవులు ఎప్పుడూ చెమట పట్టవు. పెదవులలో చెమట గ్రంథులు లేవు. దీంతో పెదాలు త్వరగా పొడిబారతాయి. ఈ కారణంగా, పెదవులు ఎక్కువ చెమట పట్టవు. అలా అని ఎండకు పెదాల ఎఫెక్ట్ కావు అని కాదు. ఎండ వల్ల పెదాలు త్వరగా పొడిబారతాయి, పగులుతాయి. వాటి సహజత్వాన్ని కోల్పోతాయి. అయినా చెమట మాత్రం పట్టదు.
ఇదే ప్రశ్న మీ ఫ్రెండ్స్‌ను అడిగి చూడండి.. ఎంత మంది కరెక్ట్ ఆన్సర్ చెబుతారో. చాలా మందికి అస్సలు తెలిసి ఉంటదు. పెదవులకు చెమట పట్టదు అంటే అశ్చర్యంగానే అనిపిస్తుంది కదా..! అట్లుంటది మరీ.!