పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెడ్డి ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అయితే ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ఆహా నిర్వాహకులు స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 9 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించి మొదటి భాగం స్ట్రీమింగ్ చేయగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన బాలయ్య తీసుకొచ్చి ఎన్నో విషయాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెడ్డి గురించి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

1997లో నందిని రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రేణూ దేశాయ్ ను 2008లో వివాహం చేసుకున్న ఈయన.. ఆమెకు కూడా విడాకులు ఇచ్చి రష్యా అమ్మాయి అన్నా లేజినోవా ను వివాహం చేసుకున్నారు. నందిని రెడ్డి విశాఖపట్నంకు చెందిన అమ్మాయి.. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు పెళ్లి అంటే ఏంటో కూడా తెలియదట. కానీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు నందిని రెడ్డిని వివాహం చేసుకున్నారట. అందుకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో గొడవలు పడి విడాకులు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ పై నందిని అప్పట్లో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది. దాంతో 2007లో పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చింది. నందిని రెడ్డి పవన్ కళ్యాణ్ తో విడాకులు జరిగిన తర్వాత తన పేరును జాహ్నవిగా మార్చుకొని.. 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నట్లు అక్కడే భర్తతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news