మన భారతదేశంలో తినే ఈ వంటకాలు అసలు ఎక్కడ నుండి వచ్చాయో తెలుసా..?

-

రుచికరమైన ఆహారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? అందరికీ రుచికరమైన ఆహారం తినాలని ఉంటుంది. అయితే మన భారతదేశంలో చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఈ పాపులర్ ఆహార పదార్థాలు మనవి కావట. మరి ఈ ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం.

 

సమోసాలు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉత్తర భారత దేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా సమోసా ఎక్కువగా చేసుకుంటారు. అయితే అసలు ఈ సమోసా ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే.. సమోసా మన దేశంలోది కాదు. దీనిని మొదట మ‌ధ్య ప్రాశ్చ్యంలో చేసేవారు. అక్కడి నుండి సమోసా ఇక్కడికి వచ్చింది.

చికెన్ టిక్కా కూడా మన దేశంలోలోది కాదు. ఇది స్కాట్లాండ్ నుండి వచ్చింది. మన దేశంలో కూడా ఇప్పుడు చాలా మంది దీన్ని ఇష్ట పడుతున్నారు. అలానే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కూడా.
ఇక బిర్యానీ విషయానికి వస్తే… రకరకాల బిర్యానీలు మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ బాగా ఫేమస్.

అయితే మనం రెగ్యులర్ గా తినే బిర్యాని కూడా మనది కాదు. మొదట బిర్యాని పర్షియా దేశంలో తయారు చేశారు. అలా ఇది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. పప్పు అన్నం కూడా మన దేశంలోనే కాదు. పప్పు అన్నం మొదట నేపాల్ లో పుట్టింది. దానిని ఇప్పుడు మనం రోజు తింటూ ఉంటాం.

అంతే కాదండి పండగలు మరియు ముఖ్యమైన రోజుల్లో గులాబ్ జామున్ తయారు చేసుకుంటూ ఉంటాము. గులాబ్ జామున్ కూడా మనది కాదు. ఇది కూడా పర్షియా లోనే పుట్టింది. చూశారా చాలా ఫేమస్ అయిన వంటకాలు ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version