రెబెల్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరో కృష్ణంరాజు కొన్ని నెలల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.. సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసి వెళ్లిపోయిన ఈయన సినీ జీవితం కోసం అందరికీ తెలిసు. అయితే అయన వ్యక్తిగత జీవితం కోసం అంతగా ఎవరికి తెలియద
వ్యక్తిగత జీవితంలోనూ కృష్ణంరాజు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.. ఆయన 1969లో తన 29 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య పేరు సీతాదేవి. వీరికి ఒక కుమార్తె ఉంది. 1995లో ఒక కారు ప్రమాదంలో సీతాదేవి మరణించడంతో కృష్ణంరాజు ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.. ఆయనను ఈ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు తప్పనిసరి పరిస్థితుల్లో రెండోసారి పెళ్లి చేసారు.. అయితే 1996లో ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరిజిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజు రెండో పెళ్లి జరిగింది. శ్యామలాదేవి కృష్ణంరాజు కంటే 28 ఏళ్లు చిన్నది. వీళ్లకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి..
పలు హిట్ చిత్రాల్లో నటించి.. తెలుగు చిత్ర సినిమాలో చెరగని ముద్ర వేశారు కృష్ణంరాజు.. తన కెరీర్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు.. చివరి రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. కోవిడ్ అనంతరం వచ్చిన ఆరోగ్య సమస్యలతో బాధడిన ఆయన.. చివరికి గుండె పోటు రావడంతో ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు..