Breaking : ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కమల్ హాసన్

-

విలక్షణ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కమల్ హాసన్ ను అయన కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చెన్నై లోని పోరూరు రామచంద్ర ఆసుపత్రికి కమల్ హాసన్ ను తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. కమల్‌ అనారోగ్యం నుంచి కోలుకోవడంతో వైద్యులు కమల్ హాసన్ ను నేడు డిశ్చార్జి చేశారు. గత బుధవారం హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్… దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిశారు.

 

Kamal Haasan hospitalised after developing fever | Entertainment News |  Onmanorama

అదే రోజు చెన్నై వెళ్లిపోయిన ఆయన సాయంత్రానికి అనారోగ్య లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు. కమల్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందగా, వైద్యులు ఎప్పటికప్పుడు కమల్ ఆరోగ్యంపై బులెటిన్ల ద్వారా సమాచారం అందించారు. ఈ మధ్యాహ్నం కమల్ ను డిశ్చార్జి చేసిన వైద్యులు, కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కమల్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-6 తమిళ్ రియాలిటీ షోతో పాటు ఇండియన్-2 చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news