ఎండకి తట్టుకో లేక అందరూ ఏసీ కి బాగా అలవాటు పడిపోయారు. ఎక్కువసేపు ఏసీ లోనే సమయాన్ని గడుపుతారు. మీరు కూడా ఎక్కువ సమయం ఏసీ లోనే గడుపుతున్నారా..? ఎక్కువగా ఏసీలో ఉండటం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరి ఆ సమస్యలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
శుభ్రమైన గాలి లభించదు:
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ గదుల లో కూర్చోవడం వల్ల మీకు మంచి గాలి రాదు. ఎందుకంటే ఏసీని తలపులన్నీ మూసేసి ఉపయోగించాలి కనుక చల్లటి గాలి వచ్చినా తాజా గాలి లోపలికి రాదు.
ప్రమాదకరమైన ముడతలు వస్తాయి:
ఎక్కువసేపు ఏసీలో సమయాన్ని గడపడం వల్ల ప్రమాదకరమైన ముడతలు వచ్చే అవకాశం ఉంది. అందుకనే మరీ ఎక్కువసేపు ఏసీలో కూర్చోకుండా ఉంటే బెస్ట్. శరీరం మీద ఉండే చెమటని అది డ్రై గా మార్చేస్తుంది. అలానే వాళ్లంతా కూడా ఆరిపోతూ ఉంటుంది. నీళ్లు చర్మంపై లేకపోవడం వల్ల ఇలా ప్రమాదకరమైన ముడతలు పడతాయి కాబట్టి మధ్య మధ్యలో ఏసీని కూడా ఆపి మీరు బయటికి వస్తే మంచిది.
ఎముకల ఆరోగ్యంపై ఎఫెక్ట్:
ఎక్కువ సేపు ఏసీ గదుల్లో సమయాన్ని గడపడం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఏసీ ఆపేసి తలుపులు కూడా తీసుకుంటూ ఉండండి.
లో బిపి సమస్య:
ఏసీ లో ఎక్కువసేపు ఉండటం వల్ల లోబీపీ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది ఇలా ఇన్ని ఇబ్బందులు మీరు ఏసి లో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల ఎదుర్కోవలసి వస్తుంది.