ఇండియాలో శకునాలను అన్ని మతాల వారు బాగా నమ్ముతారు.. అందులో కామన్‌గా ఉండేది.. ఏదైనా పనిమీద బయటకు వెళ్తుంటే.. పిల్లి ఎదురువచ్చిందంటే.. అది మంచి శకునం కాదని..మన పని అవ్వదని అనుకుంటారు. మళ్లీ ఇంట్లోకి వచ్చి కాసేపు కుర్చోని వెళ్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు పిల్లి ఎదురు రావడం అశుభమేనా అంటే కాదంటున్నారు పండితులు. పిల్లి ఎలా వస్తే మంచిది, ఎలా వస్తే మంచిది కాదో ఇప్పుడు మనం చూద్దాం.. మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు..!
మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేప్పుడు పిల్లి ఎలుకను నోట్లో పట్టుకుని ఎదురు వస్తే మనం వెళ్లే పని విజయవంతం అవుతుందని అర్థమట..
పిల్లి గనుక మనతోపాటు ఇంట్లో నుంచి బయటకు వస్తే కార్యసిద్ధి కలుగుతుంది.
బయటకు వెళ్లేటప్పుడు రెండు పిల్లులు కొట్లాడుకుంటూ ఎదురుపడితే మనం చేయబోయే పనిలో కలహాలు వస్తాయి.
పిల్లిని కుక్కలు తరుముకుంటూ మన ఎదురుగా వస్తే శత్రు భయం, ధన నష్టం కలుగుతుంది.
పిల్లి తన పిల్లలను ఏడు ఇళ్లకు మారుస్తుందట. ఇలా కనుక పిల్లి తన పిల్లలను నోట్లో పట్టుకుని మనకు ఎదురుగా వస్తే మనం చేయబోయే పనిలో ఆటంకాలతో పాటు స్థానచలనం కూడా కలుగుతుందట. ఇలా పిల్లి ఎదురుగా వస్తే వెనక్క వచ్చి కాళ్లు కడుక్కుని కాసేపు కూర్చొని ఇష్ట దైవాన్ని తలుచుకుని బయటకు వెళ్లాలని శకున శాస్త్రం చెబుతోంది.
పిల్లికి శకునాలకు లింక్ ఏంటి..?
మనం ఇంట్లో పెంచుకునే పిల్లులకు ఈ శకునాలు వర్తించవు. పిల్లి శకునంలా మారడానికి వెనుక ఒక కథ దాగి ఉంది. పూర్వకాలంలో పాలను ఉట్టిమీద దాచే వారు. బయటకు వెళ్లేటప్పుడు పిల్లి కనిపిస్తే మరలా ఇంట్లోకి వచ్చి పాలను జాగ్రత్త చేసి పిల్లి వెళ్లిన తరువాత వెళ్లే వారు. ఇది కాస్తా పిల్లి శకునంలా మారిందని పెద్దలు అంటారు… కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల వారు కూడా ఈ పిల్లి శకునాన్ని విశ్వసిస్తారు. కొందరు మూఢనమ్మకం అని కొట్టి పారేస్తూ ఉంటారు. పిల్లి శకునాన్ని నమ్మడం, నమ్మకపోవడం మన మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టికల్ నచ్చితే లైక్ కొట్టి లాగించేయండి.!