ఆక్సీజన్ లెవెల్ పెరగాలంటే ఈ చెట్టు కింద కూర్చోండి: పోలీసుల సలహా

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో ఆక్సిజన్ కోసం ఏడుస్తున్న రోగులు మరియు బంధువులకు పోలీసులు ఇచ్చిన సలహా ఇప్పుడు సంచలనంగా మారింది. ఆక్సిజన్ లెవెల్ పెంచడానికి పైపాల్ చెట్ల క్రింద కూర్చోమని చెప్పారు. ఈ సలహా విని రోగుల బంధువులు ఒక ఆక్సిజన్ ప్లాంట్ నుండి మరొకదానికి నడుస్తున్న బంధువులు షాక్ అయ్యారు. రోగి బంధువు ఒకరు…. మీడియాతో మాట్లాడుతూ మరో విషయం చెప్పారు.

రద్దీగా ఉండే ఆసుపత్రులకు బదులుగా ఇంట్లోనే వైద్యం తీసుకోవాలని పోలీసులు చెప్పారని ఆక్సీజన్ అవసరం అయినా సరే ఆక్సీజన్ అందించే వారు లేరని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసారు. ఆ రాష్ట్రంతో పాటుగా ఢిల్లీలో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఢిల్లీలో ఆక్సీజన్ కొరత ఉండటంతో ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.