నందమూరి తారకరత్న ఆసుపత్రిలో చేరి మూడు వారాలకు పైగానే అవుతుంది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం మీద హెల్త్ బుల్లెట్ వస్తుంది అని అందరూ ఆశించారు. కానీ అలా ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. అదే సమయంలో అభిమానుల ఆందోళనలు కూడా పెరిగిపోతున్నాయి. జనవరి 27వ తేదీన తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన అస్వస్థకు గురయ్యారు. వెంటనే సిబ్బంది కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ గుండెపోటు వచ్చిందని వైద్యులు ప్రథమ చికిత్సలో నిర్ధారించారు. వెంటనే అదే రోజు రాత్రి మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తారకరత్న కండిషన్ అత్యంత విషమంగా ఉందని వైద్యులు కూడా ఒక బులిటెన్ విడుదల చేశారు.
దీంతో అభిమానులు అంతా ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేశారు. కానీ అనూహ్యంగా తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రధాన అవయవాలైన కిడ్నీ ,లివర్ ,గుండె సాధారణ స్థితికి చేరుకున్నాయని.. కానీ మెదడులో సమస్య ఏర్పడిందని.. ఆయన గుండెపోటుకు గురి కావడం వల్ల ఆయన గుండెకు 45 నిమిషాల పాటు అచేతన స్థితిలో ఉంది . దీంతో మెదడుకు రక్తప్రసరణ జరగలేదు. ఫలితంగా మెదడు పైభాగం వాపుకు గురై , నీరు చేరినట్లు వైద్యులు తమ పరీక్షలో తేలిందని వెల్లడించారు.
ఇకపోతే మెదడులో సమస్య ఏర్పడిన నేపథ్యంలో తారకరత్న కోమలోనే ఉండిపోయారు. విదేశాలకు తీసుకెళ్లాలని భావించినా.. వైద్యులను ఇక్కడికి పిలిపించారని సమాచారం అందుతుంది. సోమవారం లేదా మంగళవారం తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని ప్రచారం కూడా జరిగింది . కానీ ఇప్పటివరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి హెల్త్ బులిటెన్ రాలేదు. దీంతో డాక్టర్స్ ఎందుకు సైలెంట్ అయ్యారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి వైద్యులు ఈ విషయం పై స్పందించకపోవడంతో అభిమానులు కలవరపడుతున్నారు.