తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పరీక్షల పర్వం మొదలైంది. ఇవాళ్టి నుంచి ఇంటర్‌మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, జాగ్రఫీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రయోగ పరీక్షలు రాయడం తప్పనిసరి.
మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జనరల్ విద్యార్థులు 2.62 లక్షలు, ఒకేషనల్ నుంచి 93వేల మంది.. మొత్తంగా 3.63 లక్షల మంది విద్యార్థులు వీటికి హాజరుకానున్నారు. 2,201 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రోజూ ఉదయం(9-12), మధ్యాహ్నం(2-5 గంటలవరకు) రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఒక్కోబ్యాచ్‌కు 25మంది చొప్పున విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు చదువుకునే కళాశాలల్లోనే ప్రయోగ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్‌బోర్డు పరిశీలకులను నియమించింది. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ తనిఖీలు చేస్తుందని పరీక్షల విభాగం కంట్రోలర్ జయప్రద బాయి తెలిపారు.