పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇప్పుడు శంకర్ కు కొత్త చిక్కు వచ్చి పడింది.శంకర్ కమల్ హాసన్ తో అంతకుముందే ఇండియన్ 2 సినిమాను మొదలుపెట్టారు. అది బడ్జెట్ ప్రాబ్లెమ్ వల్ల ఆగిపోయిన సంగతి అందరికి తెలిసిందే. తర్వాత కమల్ విక్రమ్ సినిమా దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తాజాగా కోర్టు ఆదేశాల మేరకు గతంలో ఆగిపోయిన కమల్ సినిమాను మళ్లీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. దీనితో రాంచరణ్ సినిమా చిక్కుల్లో పడింది.కాని శంకర్ సినిమా నిర్మాత దిల్ రాజుకు , రామ్ చరణ్ కు రెండిటినీ ఏక కాలంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడట. అందుకు తగ్గట్టుగానే రెండు సినిమాల షూటింగ్స్ ప్లాన్ చేసాడట. కాని ఇది కుదురుతుందా లేదా అని దిల్ రాజు తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. గత నాలుగైదు సినిమాలు తీసుకుంటే శంకర్ ప్రతి సినిమా ను పూర్తి చేయటానికి కనీసం 18 నెలలు నుండి రెండేళ్ల పాటు సమయం తీసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేస్తా అని తలకు మించిన భారం ఎత్తుకున్నాడు.
ప్రస్తుతం చేస్తున్న రాంచరణ్ సినిమా వచ్చే జూలై కు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా గ్రాఫిక్స్ వర్క్ , టెక్నికల్ వర్క్ అంతా పక్కాగా రావాలి. అప్పుడే అది ఆ డేట్ కు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇండియన్ 2 సినిమా 2024 వస్తుందని ఒకరు, లేదు 2023 దీపావళికి వచ్చే ఛాన్స్ వుందని మరి కొందరు అంటున్నారు. కాని ఇవన్ని జరగాలంటే శంకర్ వేగంగా పని చేయాలి. కాని శంకర్ తన ప్రతి సినిమా విషయంలో అస్సలు రాజీ పడకుండా,క్వాలిటీగా తీస్తాడు. మరి నిజంగానే శంకర్ స్పీడ్ పెంచి రెండు సినిమాలను సూపర్ హిట్స్ గా మారుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.