పిల్లలపై కూడా శని ప్రభావం ఉంటుందా? ఇదొక్కటే పరిష్కార మార్గం..

-

శని ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. శని ప్రభావం ఉంటే ఎంతటి వారైనా సరే భాధలు అనుభవించాల్సిందే..అయితే ఈ ఏలినాటి శని అనేది పిల్లలలో కూడా ఉంటుందా..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 8 సంవత్సరాల లోపు పిల్లలకి ఏలినాటి శని దోషాలు మొదలైనప్పుడు తల్లిదండ్రులు కొద్దిగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని , అర్ధాష్టమ శని ఫలితాలు పిల్లల మీద కూడా ఉంటాయి. వారి జీవితాలను కూడా ఈ దోషాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి.

అయితే పిల్లలకు ఊహ తెలియనప్పుడు ఈ దోషాల ప్రభావం ఎక్కువగా తల్లిదండ్రుల మీద పడుతూ ఉంటుంది. పిల్లలకు ఊహ తెలిసిన తర్వాత ఈ దోషాల ప్రభావం పిల్లల మీద ఉంటుంది..పిల్లలకు ఎనిమిది ఏళ్లు వచ్చాక దాని ప్రభావం అనేది చూపిస్తుంది.. చదువులో కొద్దిగా వెనకబడడం, ఏకాగ్రత తగ్గిపోవడం అలాగే అనారోగ్యానికి గురి కావడం లాంటివి వస్తూ ఉంటాయి. శని దోషం అంటే ఏమిటి.. శని గ్రహం ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తూ ఉంటుంది. జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి నుండి 12వ రాసి ఒకటవ రాసి రాశులు శనిసంచారాన్ని ఏలినాటి శని అని పిలుస్తుంటారు..

ఈ శనికి పరిహారం ఏమిటి.. తమ రాశుల ప్రకారం లేదా తమ నక్షత్ర ప్రకారం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చినప్పుడు శివాలయానికి వెళ్లి శివుని అర్చన చేయించుకోవడం వలన శని దోషం తగ్గి మంచి ఫలితాలు పొందుతారు. శని ఒక్క శివుడికి మాత్రమే లోబడి ఉంటాడని శివుడు ఆదేశాలు మాత్రమే పాటిస్తాడని శివుడు అర్పించినప్పుడు తాను సంతృప్తి పొందుతాడని శాస్త్రం తెలుపుతుంది. దానివలన జాతకం ప్రకారం గాని సంచార ప్రకారంగానే శనిగ్రహం అనుకూలంగా లేనప్పుడు శివుడికి పూజ చేయించడమే చాలా శ్రేయస్కరం. ప్రధానంగా శనివారం నాడు ఇంట్లోనే శివుడికి పూజ చేయడం లేదా శివస్త్రం పటించడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. పిల్లల తరఫున తల్లిదండ్రులు కూడా ఈ పూజ చేయించిన అర్చన చేయించిన అదే ఫలితాలు పొందుతారు.. శని ఉన్నప్పుడు పదే పదే ఆ మాట అనకూడదు..అది ఇంకా రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news