Zomato : జొమాటోలో ‘ఎవ్రీడే’ సేవలు ప్రారంభం

-

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఇప్పటికే పలు రకాల ఆఫర్స్, సేవలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సూపర్ కూల్ సేవలను ప్రారంభించినట్లు జొమాటో తెలిపింది. ఇంటి తరహా భోజనాన్ని అందించడానికి ఎవ్రీడే పేరిట సరికొత్త సేవలు షురూ చేసినట్లు వెల్లడించింది.

దీని కింద కంపెనీకి చెందిన ఆహార భాగస్వాములు ఇంటి వంటలు చేసే వారితో జట్టుకడతారు. ‘జొమాటో ఎవ్రీడే ఇంటి తరహా భోజనాన్ని మీకు అందిస్తుంద’ని కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సేవలు గురుగ్రామ్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని గోయల్‌ తెలిపారు. రూ.89 ప్రారంభ ధరతో తాజా, ఆరోగ్యకర ఆహారాన్ని వినియోగదార్లు రోజూ ఆరగించవచ్చని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news