పొగ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదన్న సంగతి అందరికీ తెలుసు అయినప్పటికీ పొగాకు కి బాగా అలవాటు పడి దాని నుంచి బయటపడలేక పోతున్నారు ఎంతో మంది.నిజానికి పొగాకు తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊపిరితిత్తుల సమస్యలు మొదలు హృదయ సంబంధిత సమస్యలు వరకు ఎన్నో సమస్యలు కలుగుతాయి. అయితే స్మోకింగ్ చేయడం వల్ల ఆర్టెరీస్ బ్లాక్ అవుతాయి అన్న సంగతి అందరికీ తెలుసు దీనిమూలంగా ఏమవుతుందంటే కరోనరి హార్ట్ డిసీజెస్ మరియు స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి.
గురువారం చేసిన ఓ స్టడీ ప్రచారం చూసుకున్నట్లయితే పొగ తాగడం వల్ల గుండె బలహీనంగా మారిపోతుంది పైగా గుండె యొక్క పని తీరు కూడా బాగా బలహీనపడిపోతుంది అని స్టడీ చెబుతోంది. అయితే స్మోక్ చేసే వాళ్ళకి తక్కువ వాల్యూమ్ బ్లడ్ లెఫ్ట్ హార్ట్ చాంబర్ లో ఉంటుంది పైగా బ్లడ్ పంప్ చేయడానికి పవర్ కూడా తక్కువ ఉంటుంది.
ఎంత ఎక్కువ స్మోక్ చేస్తే అంత హార్ట్ ఫంక్షన్ తగ్గుతుంది అని స్టడీ ద్వారా తెలుస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మందిని చంపేస్తోంది. స్మోకింగ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ డ్యామేజ్ అవ్వడం మాత్రమే కాకుండా గుండెకు కూడా ఎంతో హాని కలుగుతుంది. అందుకే వీలైనంత వరకు స్మోకింగ్ కి దూరంగా ఉంటే మంచిది.
పైగా ధూమపానం క్యాన్సర్ కు ప్రధాన కారణం. స్మోకింగ్ వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి కూడా సంభవిస్తాయి. గుండెను మాత్రమే కాకుండా మెదడును కూడా ఇది బాగా దెబ్బతీస్తుంది. ధూమపానం చేయడం వల్ల శరీరంలో ముఖ్యమైన కణజాలం తగ్గుతుంది. దీంతో మెదడు పరిణామం తగ్గి జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తుంది. రోజుకి ఇరవై సిగరెట్లు కనుక తాగితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది.