నోట్లోంచి దుర్వాసన బాగా వస్తుందా.. కారణం ఇదే కావొచ్చు..ఇలా చేసేయండి..!

-

కొంతమంది నోట్లోంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది..పాపం వాళ్లు ఎంత క్లీన్ గా బ్రష్ చేసినప్పటికీ ఒకటే కంపు కొడుతుంది. తీసుకున్న ఆహారం వల్ల కానీ, లేక లోపల ఏదైనా సమస్య ఉన్నా ఇలాంటి దుర్వాసన వస్తుంది. అసలు నోటి సందుల్లో దుర్వాసన రావడానికి కారణాలు ఏంటి, ప్రకృతి పరంగా తగ్గించుకునే మార్గాలు ఈరోజు చూద్దాం.

పళ్లసందుల్లో ఆహార పదార్థాలు, వ్యర్థాలు నిల్వఉండిపోయి..వాటిని తినడానికి చెడ్డ సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఆ చెడ్డ సూక్ష్మజీవులు ఎంత ఎక్కువ ఉంటే..అంత చెడ్డవాసన వస్తుంది. స్వీట్స్, జంక్ ఫుడ్స్, ఎమ్టీకార్బోహైడ్రేట్స్ తినేసినప్పుడు, చాక్లెట్స్ తిన్నప్పుడు ఇవి పళ్లసందుల్లో అంటుకుంటాయి. వాటిని తింటానికి పెరిగిన సూక్ష్మజీవులు ఉండి..అవి వదిలే వేస్ట్ పళ్లపైన గారలాగాపట్టి..అందులో క్రిములు బాగా డవలప్ అవుతాయి. దానివల్ల దుర్వాసన రావొచ్చు. ఇది ఒక కారణం అయితే..

రెండవ కారణం..మోషన్ సరిగ్గా వెళ్లనప్పుడు. ప్రేగులు జీర్ణాశయంలో టాక్సిక్ లోడ్ ఎక్కువ అయినప్పుడు నోట్లోంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ ను బట్టి..మనలో స్వచ్చత ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. మూత్రం వాసన, చెమటవాసన, మలం వాసన, సొంగ వాసన, నోరు వాసన..ఈ ఐదు వాసనలు ఘాటుగా వస్తున్నాయంటే..మనలో పెద్ద డంప్ యార్డే పేరుకుపోయిందని అర్థం..ఇవి వాసనరహితంగా ఉన్నాయంటే..మనలో ఫ్రష్ గా ఉంది అని అర్థం..పైకి ఫ్రష్ గా కనిపించటం తేలికే…బాడీలోపల కూడా అంతే ఫ్రష్ గా ఉండాలి..లేకుంటే నోరు తెరిస్తే కంపు కొడుతుంది.

మంచినీళ్లు తక్కువ తాగేవారికి కూడా స్మెల్స్ ఎక్కువగా వస్తుంటాయి. వ్యర్థాలు సరిగ్గా బయటకు పోకపోవడం వల్ల ఇది జరుగుతుంది. సూటూబూటూ వేసుకుని..సెంట్ కొట్టుకుని టిప్ టాప్ గా రెడి అయినా..నోరు నుంచి దుర్వాసన వస్తుంది…అందుకే మౌత్ ఫ్రషనర్స్ వాడుతుంటారు కొందరు. దానివల్ల దంతాలు పుచ్చిపోవడం, దీర్ఘరోగాలు వస్తుంటాయి.

ఈ స్మెల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఉదయం పూట నీరు బాగా త్రాగాలి. మోషన్ వెళ్లడానికి ట్రై చేయండి. ఉదయం గ్యాప్ ఇచ్చి అయినా 2-నుంచి 2.50లీటర్ల నీళ్లు తాగారంటే..మీలో ఉన్న టాక్సిన్ అన్నీ క్లీన్ అయిపోతాయి.

బ్రష్ చేసుకునేప్పుడు..ముందుగా ఒక పది నిమిషాలు వేపపుల్లను బాగా నమలితే కూడా ఆ లాలాజలం ద్వారా వచ్చే ఆ చేదుకు క్రిములు చనిపోతాయి. ఏ పేస్టులు వేపపుల్లకు సాటిరావు. రాత్రిపొడుకునే ముందు కూడా ఇలానే ఓ రెండునెలల పాటు చేస్తే..దుర్వాసన సమస్య పోతుంది.

ఇంకా పేస్ట్ బ్రషింగ్ కంటే కూడా ఒరిజనల్ క్వాలిటీ తేనె తీసుకుని బ్రష్ లో ముంచి దాంతో బ్రష్ చేయొచ్చు. రోజుకు రెండుసార్లు ఇలా చేయొచ్చు.

బోజనం చేసిన వెంటనే..పుక్కిలించటం మాత్రం అలవాటుగా చేసుకోండి.

ఇలా చేస్తుంటే రెండు నెలల్లోనే సమస్య పోతుంది.

మౌత్ స్ప్రేకు బదులుగా నాచురల్గా ఏమైనా వాడొచ్చా.?

యాలుక్కాయ చక్కగా పనిచేస్తుంది. ఒక్క కాయ నోట్లో పెట్టుకుని అప్పుడప్పుడు ఒక గింజ కొరుకుతూ ఉంటే.. ఆ మంచి స్మెల్ నోట్లో దుర్వాసన రానివ్వదు. అప్పుడప్పుడు లవంగం కూడా వేసుకోవచ్చు.

వీటితో పాటు.. పెద్ద ఉసిరికాయ ముక్కలు ఎండపెట్టి అప్పుడప్పుడు చప్పరిస్తుంటే..బాడ్ బాక్టీరియాలు మొత్తం చచ్చిపోతాయి. పవర్ ఫుల్ క్లీనింగ్ ఏజంట్ ఇది.

ఈ మూడు వాడుకుంటూ ఉంటుంటే..స్ర్రేలు ఏం కొట్టుకుండా పనిచేస్తాయి. పైన చెప్పిన పద్ధతులు పాటిస్తూ.. సమస్యను పరిష్కరించుకోవచ్చు అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం..నోటి దుర్వాసనకు చెక్ పెట్టేయండి మరీ..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news