కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రజల దగ్గరకు వెళ్ళడానికి ‘భారత్ జోడో యాత్ర’ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే..సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ యాత్ర మొదలై 3 నెలలు అవుతున్నా కూడా రాహుల్ గాంధీలో ఏమాత్రం అలుపు కనిపించడం లేదు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల రాహుల్ గాంధీకి అపూర్వమైన స్వాగతాలు లభిస్తున్నాయి.
ప్రస్తుతం యాత్ర కొనసాగుతున్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోనూ ఆయనకి అలాంటి సాదరస్వాగతమే దక్కింది..రెండు కుక్కలు బొకే లను నోట పట్టుకుని రాహుల్‌కు, భారత్ జోడో యాత్రకు సుస్వాగతం పలికాయి. ”అడుగులు వేయండి.. దేశాన్ని ఐక్యం చేయండి”, ”ద్వేషాన్ని వీడండి.. భారత్‌ను ఏకం చేయండి” అనే సందేశాలు రాసివున్న రెండు బుట్టల పుష్పగుచ్చాలతో అవి రాహుల్‌ను ఆహ్వానించాయి.
ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిని అమితంగా ఆకట్టుకుంది.. ఈ దృశ్యం మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లా తాండోడియా పట్టణంలో శుక్రవారం జరిగింది.. అయితే ఆ కుక్కల వయస్సు 6 ఏళ్ళు.. లిజో, రెగ్జీ. ఇండోర్‌కు చెందిన సర్వమిత్ర నచన్ ఈ శునకాల యాజమాని. యాత్రం కోసం ఏదైనా వినూత్నంగా చేయాలని తాము భావించామని, గాంధీకి స్వాగతం చెప్పేందుకు కుక్కలకు శిక్షణ ఇచ్చామని అతడు చెప్పాడు. భారత్ జోడో యాత్ర మొదలైన నాటి నుంచి ఫాలో అవుతున్నామని వెల్లడించారు. కాగా లిజో, రెగ్జీల నుంచి రాహుల్ పుష్పగుచ్ఛాలను స్వీకరించడమే కాకుండా వాటితో ఫొటోలు కూడా దిగాడు..అవి ఎలా పట్టుకున్నాయా అని వాటిని పరిసీలించారు..మొత్తానికి ఆ యాత్రకు ఇది హైలెట్ అయ్యింది.