ఎఫ్​డీ చేస్తున్నారా..? అయితే ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే…!

-

చాలా మంది డబ్బులని బ్యాంకులో పెట్టి ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తూ వుంటారు. ఇలా డబ్బులని ఫిక్సెడ్ చేస్తే మంచిగా వడ్డీ వస్తుంది. అయితే అన్ని బ్యాంకుల్లో ఒకే వడ్డీ రేటు రాదు. బ్యాంకుని బట్టీ వద్దే రేటు ఉంటుంది. చాలా మంది తమ చేతిలో ఉన్న డబ్బును దాచుకోవడానికి, మంచి రాబడి పొందడానికి ఫిక్స్​డ్​ డిపాజిట్లలో డబ్బులు పెడతారు.

money
money

ఇందులో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ ఉండదు. వివిధ బ్యాంకులు తరచుగా ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. ఐడీబీఐ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎఫ్​డీ రేట్లను సవరించాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే కొన్ని ప్రైవేట్​ బ్యాంకులే ఎఫ్​డీలపై ఎక్కువ వడ్డీ ఇస్తాయి. వాటిలో ఎక్కువగా యాక్సిస్ బ్యాంక్ ఇస్తుంటుంది. డొమెస్టిక్​, ఎన్​ఆర్​ఐ ఎఫ్​డీ వడ్డీ రేట్లను తాజాగా సవరించింది. దేశీయ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్, ఎన్ఆర్ఐ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లని తీసుకొచ్చింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి గల ఎఫ్​డీలపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి.

7 రోజుల నుంచి 29 రోజులకి రూ. 2 కోట్లలోపు ఫిక్స్​డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీ రేటు వస్తుంది. 30 రోజుల నుంచి 3 నెలలకి 3.00 వడ్డీ రేటు అందిస్తోంది. 3 నెలల నుంచి ఆరు నెలలకి 3.50 శాతం, 6 నెలల నుంచి ఏడాది వరకు 4.40 శాతం ఇలా ఉంటాయి వడ్డీ రేట్లు.

Read more RELATED
Recommended to you

Latest news