రైతులు వ‌రి వేయండి.. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసైనా స‌రే కొనిపిస్తా : వైఎస్ ష‌ర్మిల‌

-

తెలంగాణ రైతులు బాజాప్తాగా వ‌రి వేయండ‌ని వైఎస్ ష‌ర్మిల పేర్కొన్నారు. రైతు ఆవేద‌న యాత్ర‌ లో భాగంగా కామారెడ్డి జిల్లా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం ఎడ్లూర్ ఎల్లారెడ్డిలో పర్యటించారు వైఎస్ ష‌ర్మిల‌. వడ్లు కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నారు యాదయ్య కుటుంబాన్ని ఈ సంద‌ర్భంగా ప‌రామ‌ర్శించారు ష‌ర్మిల‌.

ఈ రైతు మరణానికి ప్రభుత్వమే కారణమ‌ని.. .ఓ వైపు రైతులను చంపుకుంటూ,మరోవైపు ధర్నాలు చేయడం సిగ్గు చేటు అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్ర‌భుత్వానికి చావు డ‌ప్పు కొట్టాలని… వరి వేసుకోవ‌డం రైతుల హ‌క్కు అని స్ప‌స్టం చేశారు. రైతులు బాజాప్తాగా వ‌రి వేసుకోండని.. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసైనా స‌రే వ‌డ్లు కొనేలా చేస్తామ‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రాణం పోయే వరకు రైతుల కోసం కొట్లాడుతాన‌ని.. వ‌రి వ‌ద్ద‌నే ముఖ్య‌మంత్రి మ‌న కొద్దంటూ నిప్పులు చెరిగారు వైఎస్ ష‌ర్మిల‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ స‌ర్కార్ త‌గిన బుద్ది చెప్పాల‌ని ష‌ర్మిల కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news