మీ కోరికలు వెంటనే తీరాలంటే అక్షయతృతీయ నాడు ఇలా అస్సలు చెయ్యకండి…

-

మనదేశం సంసృతులకు, సాంప్రదాయాలకు నిలయం.. ప్రతి పండగను ప్రత్యేకంగా జరుపుకుంటాము..కొన్ని పూజలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు అంటున్నారు.. ఇక అక్షయ తృతీయ రోజు కూడా పూజ చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి. సాధారణంగా అక్షయ తృతీయరోజు కాస్తయినా బంగారం కొనాలనీ దానివల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ప్రతి ఒక్కరు కూడా అపోహ పడుతుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు కేవలం బంగారం కొనడం వల్ల మాత్రమే మంచి జరగదు. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి ప్రసన్నం కావడానికి, మన కోరికలు తీరడానికి లక్ష్మి, కుబేర పూజలు చాలా సహాయపడతాయని వేద పండితులు చెబుతున్నారు.

ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే తమకి లక్ష్మీదేవి అలాగే కుబేర అనుగ్రహం కలిగి ఉంటుంది. దీంతో వారు అనుకున్న ప్రతి పని కూడా సకాలంలో జరుగుతాయి. ఇక వారి ఇంట్లో ధన ప్రవాహం కూడా కలుగుతుంది. అయితే అక్షయ తృతీయ రోజు ఆ పూజలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం… అక్షయ తృతీయ రోజూ కుబేరుడు చిత్రా దేవి సమేతంగా ఉన్న పఠము, ఒక ప్లేట్, రెండు రూపాయల నాణేలు, ఒక లక్ష్మీకాసు, తాంబూలం, పంచామృతం, పండ్లు, పూలు, నైవేద్యం కొరకు పాయసం, దద్దోజనం, కలశం ఉండాలి..అలాగే ఈ పూజలో పెట్టే దీపాన్ని ఒక రోజంతా కొండేక్కకుండా చూసుకోవాలి. అలాగే ఉపవాస దీక్షలు కూడా చేయాలి. పూజ ముందు అలాగే తర్వాత రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి..

అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్ర లేచి తమ ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో పసుపుతో అలకాలి. ఇక దానిపై కుబేర ముగ్గు వేసి పసుపు, కుంకుమలు ఉంచాలి. అంతేకాకుండా కుబేర ముగ్గుపై పీఠం వేసి ముందు చెప్పిన పటమును ఉంచాలి. దానిపై పసుపు, కుంకుమ పూలను పెట్టాలి. ఇక ఆ పఠము ముందు కూడా కలశం ఉంచాలి. ఇక ఆ తర్వాత ఒక ఆకు తీసుకొని పసుపు గణపతి చేసుకొని ఆ పీఠము పైన ఉంచాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో, లక్ష్మీకాసు, కుబేరుడు చిత్రావతి ప్రతిరూపంగా రూపాయి నాణేలు ఉంచి పూజించాలి. ఇక మనకున్న కోరికలు అనుకుంటూ నెరవేరుతుందనే సంకల్పంతో కంకణం కట్టుకోవాలి.. ముందుగా గణపతి పూజలు చెయ్యాలి.. ఆ తర్వాత మిగిలిన పూజలు చెయ్యడం మర్చిపోకండి..

Read more RELATED
Recommended to you

Latest news