ఏపీలో మైండ్ గేమ్ ఓ రేంజ్ లో నడుస్తుంది…ఇంతకాలం అధికారం వైసీపీనే మైండ్ గేమ్ ఆడుతుందని అనుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష టిడిపి సైతం మైండ్ గేమ్ మొదలుపెట్టింది. అసలు టిడిపి పని అయిపోయిందని, ఇంకా చంద్రబాబు రాజకీయాల్లో కనిపించరని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ..ఓ రకమైన మైండ్ గేమ్ ఆడుతూ టిడిపిని దెబ్బకొట్టాలని చూస్తున్నారు.
ఇక ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టిడిపి మైండ్ గేమ్ మొదలుపెట్టింది. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పడం, ఆ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి వైపు మొగ్గు చూపడంతో సీన్ మారింది. ఇప్పటికే అదే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక వైసీపీ ఏమో నెక్స్ట్ ఎన్నికల్లో అన్నీ సీట్లలో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకే జగన్ కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుస్తామని,. వై నాట్ 175 అని అంటున్నారు.
అంటే ఇక్కడ 175 సీట్లు గెలిచేస్తారని కాదు..ఆ గెలుస్తామనే కాన్ఫిడెన్స్ వైసీపీ శ్రేణుల్లో తీసుకురావడం, టిడిపి శ్రేణులని నిరాశపర్చడం..ఇక జగన్ కు కౌంటరుగా చంద్రబాబు సైతం 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని, వై నాట్ పులివెందుల అని అంటున్నారు. అంటే పులివెందులలో కూడా జగన్ ని ఓడిస్తామని ధీమాలో బాబు ఉన్నారు. అయితే ఇవన్నీ జరుగుతాయా? అంటే ఏది జరగదనే చెప్పాలి. వై నాట్ కుప్పం అని జగన్ అంటున్నారు..అక్కడ చంద్రబాబుని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు ఏదో అధికారం ఉందని కాస్త హడావిడి ఉన్నా సరే సాధారణ ఎన్నికల్లో కుప్పం ప్రజలు బాబు వైపే ఉంటారు.
ఇక వై నాట్ పులివెందుల అని బాబు అంటున్నారు. అసలు పులివెందులలో జగన్ ని ఓడించడం జరిగే పని కాదు. కాకపోతే ఇదంతా ఓ రకమైన మైండ్ గేమ్ మాత్రమే.