పీఎఫ్ ఖాతాదారులు ఈ తప్పు చేస్తే… డబ్బులు మాయం..!

-

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. వీళ్ళ నెల జీతం నుంచి 12 శాతం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి మరో 12 శాతం కంపెనీ కలుపుతుంది.

ఈ డబ్బంతా కూడా రిటైర్మెంట్ తర్వాత మన అవసరాల కోసం ఉపయోగపడతాయి. అయితే మనం ఏదైనా పొరపాటు కనుక చేస్తే డబ్బులు కోల్పోయే ప్రమాదం వుంది. ఇక ఎలాంటి ప్రమాదం రావచ్చు అనేది చూద్దాం. ముంబయిలోని 47 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి పీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేస్తుంటే ఏకంగా రూ.1.23 లక్షలు కోల్పోయాడు.

రూ.1.23 లక్షలు పోవడానికి కారణం ఏమిటి..?

EPFO కస్టమర్ కేర్ నంబర్‌ను ఈ వ్యక్తి ఇంటర్‌నెట్ నుంచి తీసుకున్నాడు. కాల్ చేసి పీఎఫ్ బ్యాలెన్స్ ని తెలుసుకోవాలని అనుకున్నాడు. ఏకంగా రూ.1.23 లక్షలు మాయమయ్యాయి.
కారణం ఏమిటంటే.. అతడు ఇంటర్నెట్‌ లో తీసుకున్న నంబర్ నిజమైనది కాదు. హ్యాకర్లు ఉంచింది. వాళ్ళు ఒక రిమోట్ యాక్సెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు. కట్ చేస్తే 14 వేర్వేరు ట్రాన్సాక్షన్ల ద్వారా డబ్బులని కోల్పోవాల్సి వచ్చింది. పైగా ఫోన్‌కు వచ్చిన కోడ్‌ను చెప్పమంటే కూడా ఆ వ్యక్తి చెప్పేసాడు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కి మీరు ఇలా ఎక్కడ నుండీ నెంబర్స్ ని తీసుకోకండి. కేవలం ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్ ఉమంగ్ ద్వారా చూడడమే మంచిది. అలానే పెర్సనల్ విషయాలని కూడా ఎవరికీ చెప్పద్దు.

Read more RELATED
Recommended to you

Latest news