కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. కేంద్రం అందించే స్కీమ్స్ ని పొందితే ఆర్ధికంగా ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగి పోతాయి. మోడీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకు వస్తోంది. వాటిలో జన్ ధన్ యోజన కూడా ఒకటి.
సుమారు 47 కోట్ల మందికి ఈ ఖాతాలు వున్నాయి. ఈ జన్ ధన్ ఖాతా ఉన్నట్టయితే ప్రభుత్వం అందించే 10 వేల రూపాయలు ని మీరు పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఖాతాలో రూ.1 లక్ష 30 వేల బీమా వంటి లాభాలను పొందొచ్చు. దీని కోసం మీరు బ్యాంకుకి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జన్ ధన్ ఖాతా వలన కలిగే లాభాలు:
జన్ ధన్ ఖాతా వలన చాలా లాభాలు వున్నాయి. ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సిన పని లేదు.
అలానే ఈ ఖాతా ని తెరిస్తే రూపే డెబిట్ కార్డ్‌ను ఇస్తారు.
బ్యాంకులో దరఖాస్తు చేస్తే ఖాతాలో రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు.
రూ.10వేలకు దీన్ని పెంచారు.
పైగా అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే ఈ సదుపాయం ని పొందవచ్చు.
ఇలా ఈ అకౌంట్ ని తెరవచ్చు:
ఇప్పటి వరకు మీరు ఏ జన్ ధన్ ఖాతాను ఓపెన్ చేయకపోతే ఇప్పుడు అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు.
దీనికి మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ని సబ్మిట్ చేయాల్సి వుంది. బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.