కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు ఉండటం లేదు.. ఎలా ఖర్చులు అవుతున్నాయో తెలియడం లేదని అంటుంటారు..తిండి, తిప్పలు మాని డబ్బుల కోసం బాగా కష్ట పడతారు. అయినప్పటికీ సంపాదించిన డబ్బు సంపాదించినట్టుగానే అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఆర్థిక పరిస్థితులు ఎదురవకూడదు అని రూపాయి రూపాయి పోగేసుకున్నప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యలు ఎదురవ్వడానికి వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చునని పండితులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి నుంచి వ్యాపార స్థలాలు ఆఫీసుల్లో వరకు ప్రతి ఒక్క చోట కూడా వాస్తు విషయాలను నమ్ముతున్నారు. అయితే మీ ఇంట్లో డబ్బు నిలవకపోతే కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించాలి. చాలామంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలి పోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి బయటకు తీసెయ్యాలి. అలాగే మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి..
అదే విధంగా ఇంట్లో బెడ్ రూములో ఇనుప కడ్డీని కానీ ఇనుప వస్తువును కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుతుంది. బెడ్ రూం ఎంట్రెన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపు ఇలా ఇనుప కడ్డీ లేదంటే వస్తువును వేలాడ దీస్తే మంచిది. మీ ఇంట్లో ధనం నిలవాలంటే లక్ష్మీ దేవి డబ్బు, నగలతో నవ్వుతున్న ఫోటోలను పెట్టడం మంచిది..