జీవితం అంతా చీకటే ఉందనుకోవద్దు… వెల్తురు కూడా మీకోసం వేచి చూస్తుంది..!

-

చాలా మంది జీవితంలో కేవలం కష్టాలే ఉంటున్నాయని.. నాకే ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటారు. పైగా ఈ జీవితం అంతా నేను ఇంతేనేమో ఇలానే ఉండి పోవాలి ఏమో అని తరచు దాని గురించే బాధపడుతూ కనీసం ప్రయత్నం చేయకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతూ ఉంటారు. అయితే నిజంగా అలాంటి వాళ్ళు జీవితాంతం బాధ లోనే ఉండిపోవాలా..? వారికంటూ మంచి సమయం ఉండదా..?

 

నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుతురు, చీకటి రెండు ఉంటాయి. అయితే ఎప్పుడైనా ఓటమి కానీ బాధలు కానీ వచ్చాయంటే దానినే తలచుకుని బయటపడక పోవడం వాళ్ళ తప్పు. ఎప్పుడైనా సరే ఒక బాధ లేదా ఓటమి మనకు ఎన్నో నేర్పుతుంది. తిరిగి మళ్ళీ మనం అదే తప్పును చేయకూడదని.. ఆ తప్పు నుండి కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆ సందర్భం మనకు తెలుపుతుంది.

మన జీవితంలో ఎదురయ్యే మనిషైనా.. సందర్భం అయినా మనకి కొత్త విషయాలను తెలుపుతాయి. అటువంటి పట్టించుకోకుండా వదిలేయడం మన తప్పు. ఎప్పుడూ కూడా చీకట్లో ఉన్నానని బాధపడకూడదు. చీకటి తర్వాత వెలుతురు వస్తుందని జీవితాన్ని మీరే మార్చుగలరని నమ్మండి. ఈ ఓటమి నుంచి మీరు కొత్త విషయాలను తెలుసుకుని వాటిని మళ్ళీ తిరిగి చేయకుండా ముందుకు వెళ్లండి.

మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. అలానే మొదటి ప్రయత్నం చేయాలి. ఇలా వీటినన్నిటిని మీరు ఆచరిస్తూ వెళితే ఖచ్చితంగా మీ జీవితంలో వెల్తురుఉంటుంది మీరు చేసే ఈ చిన్న చిన్న మార్పుల వలన ఆ చీకటి మొత్తం తొలగిపోయి… గెలుపుని పొందొచ్చు మీ రాత మీరు మార్చుకోవచ్చు.

కొత్త కొత్త సవాళ్లు మనకి ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉండాలి శారీరకంగా పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా మీరు ప్రతిదీ కూడా ఆచరిస్తూ వెళితే వెల్తురు కనపడుతుంది. ఎప్పుడూ వెల్తురు మీ కోసం వేచి చూస్తుంది అందుకే ప్రయత్నించి చీకటి నుండి బయటికి వెళ్ళండి. అందమైన లోకాన్ని నిర్మించుకుని ఆనందంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Latest news