దోస్త్ మూడో దశ రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. ఎప్పటిదాకా అంటే ?

-

దోస్త్ మూడో దశ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 9 వరకు పెంచారు. ఈ నెల 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలానే అక్టోబర్ 15న మూడో దశ సీట్ల కేటాయించనున్నారు. దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం 15 నుండి 26 వరకు స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ కూడా జరగనున్నాయి. ఇక వీటికి వెబ్ ఆప్షన్స్ 15.10.2020 నుండి 27.10.2020 వరకూ ఉండనున్నాయి. అక్టోబర్ 30న స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉండనుంది. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ సెకండ్ ఫేజ్ లో కొత్తగా 60,539 మందికి సీట్లు కేటాయించారు.

మొదటి విడతలో సీటు కంఫర్మ్ చేసుకుని ఇతర కాలేజికి అప్లై చేసుకున్న వారిలో 5 వేల మంది కి రెండో విడతలో కేటాయించారు. మొదటి విడతలో లక్షల 41 వేల మందికి సీట్లు కేటాయిస్తే కంఫర్మ్ చేసుకున్న వారు లక్షా 7 వేల 645 మంది మాత్రమే, దోస్త్ పరిదిలో ఉన్న 986 డిగ్రీ కళాశాలల్లో 4 లక్షల 9 వేల 456 సీట్లు ఉంటే… రెండో విడత కేటాయింపు ల తర్వాత ఇంకా 2 లక్షల 41 వేల 266 సీట్లు మిగిలే ఉన్నాయి. ఆ సీట్లు ఇప్పుడు ఫిల్ అవ్వచ్చని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news