పాలపొడి మీ అందాన్ని మరింత పెంచుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. అయితే పాలపొడి వల్ల ఎలా మన అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..! ఇక్కడ కొన్ని ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్స్ గురించి చెప్పడం జరిగింది. వాటి కోసం ఒక లుక్ వేసేయండి. దీనిని చేసుకోవడం కూడా సింపుల్. పైగా మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది.
పాల పొడి, తేనె :
దీని కోసం కొద్దిగా పాలపొడి మరియు తేనెను తీసుకొని మెత్తని పేస్టులాగ చేసుకోండి. దీనిని ముఖం మీద అప్లై చేసి గుండ్రంగా మసాజ్ చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచేశాక చల్లని నీళ్ల తో కడిగేసుకోండి. ఇలా ఈ పద్దతిని వారం లో మూడు సార్లు చేయండి. దీని వల్ల మీ చర్మం నిగనిగలాడుతుంది.
పాల పొడి, తేనె, పసుపు:
ఈ ఫేస్ మాస్క్ వల్ల మంచి అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. దీని కోసం ఒక టీ స్పూన్ పాల పొడి, ఒక అరచెంచా పసుపు, ఒక టీ స్పూన్ తేనె తీసుకుని మూడింటిని బాగా కలపండి. ఆ తర్వాత ముఖం మీద అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ను కూడా మీరు వారం లో మూడు సార్లు ఉపయోగించవచ్చు.
పాలపొడి, శెనగ పిండి మరియు కమలా రసం:
దీని కోసం మీరు కొద్దిగా పాలపొడి, కమలా రసం, శెనగ పిండి తీసుకోండి. ఇప్పుడు బాగా కలిపి దీనిని ముఖం మీద అప్లై చేసుకోండి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోండి. దీని వల్ల మీ చర్మం మరింత అందంగా మారుతుంది.