బ్యాడ్మింటన్ అంటే కేవలం క్రీడాకారులు మాత్రమే ఆడాలి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దీన్ని ఎవరైనా ఆడవచ్చు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ కొంత సమయం పాటు బ్యాడ్మింటన్ ఆడడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ఇది తేలికైన వ్యాయామమే. ఆరంభంలో కొద్దిగా కష్టం అనిపించినా నెమ్మదిగా అలవాటు అవుతుంది. దీంతో పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
1. బ్యాడ్మింటన్‌ను రోజూ ఆడడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. పిక్కలు, తొడలు, పాదాల్లో ఉండే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
2. బ్యాడ్మింటన్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి.
3. ఒత్తిడిని తగ్గించుకునేందుకు బ్యాడ్మింటన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. హ్యాప్పీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రశాంతతను అందిస్తాయి.
4. బ్యాడ్మింటన్ వల్ల శరీరం సులభంగా ఎటంటే అటు తిరుగుతుంది. కీళ్లు, కండరాలు సాగుతాయి. ఆరోగ్యంగా ఉండదచ్చు.
5. బ్యాడ్మింటన్ వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
6. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఆట ఎంతగానో దోహదపడుతుంది.
7. మానసిక సమస్యలు ఉన్నవారు బ్యాడ్మింటన్ ఆడితే ఫలితం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
8. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ ఆట ఆడడం వల్ల వారితో బంధం మరింత పెరుగుతుంది. అన్యోన్యంగా ఉంటారు. ఆత్మీయతలు పెరుగుతాయి. కుటుంబం, స్నేహితులకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు.
9. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ బ్యాడ్మింటన్ ఆడితే ఫలితం ఉంటుంది. త్వరగా బరువు తగ్గేందుకు ఈ ఆట సహాయం చేస్తుంది.
10. బ్యాడ్మింటన్ వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
11. రోజూ బ్యాడ్మింటన్ ఆడితే త్వరగా మరణం సంభవించే అవకాశాలు 23 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.
12. బ్యాడ్మింటన్ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
13. మెదడు చురుగ్గా ఉండేందుకు, యాక్టివ్‌గా పనిచేసేందుకు, మెదడు పనితీరుకు బ్యాడ్మింటన్ ఎంతగానో సహాయం చేస్తుంది.
14. బ్యాడ్మింటన్ కేవలం ఆట మాత్రమే కాదు. అందులో నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించాలి. దీని వల్ల స్మార్ట్‌గా ఆలోచించే శక్తి పెరుగుతుంది.
15. బ్యాడ్మింటన్ వల్ల శరీరాన్ని వేగంగా కదిలించవచ్చు. రిఫ్లెక్స్ యాక్షన్ పెరుగుతుంది. ఇది నిత్య జీవితంలో సహాయ పడుతుంది.