జగన్ కాళ్ళు నొక్కే మనిషి కావాలా..పోరాడే పనబాక కావాలా: లోకేష్

Join Our Community
follow manalokam on social media

22 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉండి ఢిల్లీలో ఏమి పీకారు అన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పార్లమెంట్ లో కేంద్రన్ని ఒక్క మాట అడిగారా అని ఫైర్ అయ్యారు లోకేష్. మన కోసం పోరాడే పనబాక కావాలా… జగన్ కాళ్ళు నొక్కే మనిషి కావాలా అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వరదయ్య పాలెం ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ పాల్గొన్నారు.

టీడీపీ నేత నారా లోకేశ్

ఇది వైసిపి ప్రభుత్వం కాదు జెసిబి ప్రభుత్వం అన్నారు. జేసిబి అంటే జగన్ టాక్స్ , కరప్షన్, బాదుడు అన్నారు. ఓ పక్క అలీబాబా ఆయన దొంగలు మరో పక్క టిడిపి వీరులు పోరాటం చేస్తున్నారన్నారు. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ కి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా జగన్ వేధించారన్నారు. దళితుడనే కనీస గౌరవం ఇవ్వలేదు. దళిత నేత చనిపోతే కనీసం నివాళులు అర్పించడానికి వెళ్లలేదు. ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి చనిపోతే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ వెళ్ళాడన్నారు. వైసిపి పాలనలో చిత్తూరు లో బాగు పడింది ఒక్క పెద్దిరెడ్డి మాత్రమే అన్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...