మీ మొబైల్ లో ఇలా ఈజీగా ఆధార్ ని డౌన్లోడ్ చేసుకోండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన చాలా లాభాలు వున్నాయి. ఎన్నో వాటికి ఆధార్ అవసరం. భారతీయులకు ఆధార్ కార్డు అవసరం. అడ్రస్ ప్రూఫ్‌గా, గుర్తింపు కార్డుగా ఉపయోగ పడుతుంది. కొన్ని కొన్ని సార్లు మనం ఆధార్ కార్డు మర్చిపోతుంటాం. ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చెయ్యచ్చు.

ఇది చాలా ఈజీ ప్రాసెస్. డిజిటల్‌గా అందులో సైన్ చేసి ఉంటుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. భౌతిక కార్డు లాగే పని చేస్తుంది. అవసరం ఉన్న అన్ని చోట్ల దీన్ని చూపించాలి. ఆధార్ కార్డును మీ వెంట ఎక్కడికీ తీసుకు వెళ్ళక్కర్లేదు. ఈ అవకాశాన్ని UIDAI కల్పిస్తుంది. ఇక ఎలా డౌన్లోడ్ చెయ్యచ్చో చూసేద్దాం.

దీని కోసం మొదట మీరు అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in లేదా eaadhaar.uidai.gov.in కు వెళ్లాలి.
హోం పేజీలో My Aadhaar ట్యాబ్ కింద Download Aadhaar అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దీనిని క్లిక్ చేయాలి.
ఇంకో పేజీ వస్తుంది. మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఎంటర్ చేయాలి.
పేరు, పిన్ కోడ్, ఇమేజ్ క్యాప్చా ని ఎంటర్ చేయాలి.
ఇప్పుడు మీరు గెట్ వన్ టైం పాస్‌వర్డ్‌పై క్లిక్ చేసేయండి.
ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. ఆ తరవాత డౌన్‌లోడ్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీకు ఆధార్ కార్డు వస్తుంది.
పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అక్కడ మీ పేరు లోని మొదటి నాలుగు అక్షరాలు (క్యాపిటల్ లెటర్స్), మీ పుట్టిన తేదీ సంవత్సరం ని ఎంటర్ చేయాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news